KTR: పనిభారంపై ప్రశ్నించినందుకు పోలీసులపై వేటు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ తుగ్లక్‌ నిర్ణయాలు కాదా..?

KTR Tweet on TGSP Constables Suspension
x

KTR: పనిభారంపై ప్రశ్నించినందుకు పోలీసులపై వేటు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ తుగ్లక్‌ నిర్ణయాలు కాదా..?

Highlights

ఎక్స్‌ వేదికగా రేవంత్‌ సర్కార్‌పై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు.

KTR Tweet: ఏక్ స్టేట్‌, ఏక్‌ పోలీస్‌ విధానం అమలు చేయాలంటూ ఆందోళనలు చేసిన తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై తెలంగాణ పోలీస్‌శాఖ సస్పెన్షన్‌ వేటు నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. ఎక్స్‌ వేదికగా రేవంత్‌ సర్కార్‌పై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతిని రగిల్చిందెవరు..? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ తుగ్లక్‌ నిర్ణయాలు కాదా..? రేవంత్‌రెడ్డి అనాలోచిత విధానాలు కాదా..? అంటూ నిలదీశారు. గతంలో డిజిటల్‌ సర్వే పేరుతో A.E.O లపై వేటు వేశారు. ఇప్పుడు పనిభారంపై ప్రశ్నించినందుకు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలోని ప్రతి మనిషి ఆలోచిస్తున్నది ఒక్కటే.. ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు మాజీమంత్రి కేటీఆర్.


Show Full Article
Print Article
Next Story
More Stories