KTR Tweet: అప్పు - తప్పు అన్నోళ్లని... ఇప్పుడు దేనితో కొట్టాలి..

KTR to Attend in Nampally Court Today
x

Defamation Case: నేడు నాంపల్లి ప్రత్యేక కోర్టుకు మాజీ మంత్రి కేటీఆర్

Highlights

KTR Tweet: తెలంగాణ సీఎం కుర్చీ రేవంత్ రెడ్డి ఎక్కిన రోజు నుంచి తెచ్చిన అప్పు 80 వేల 500 కోట్లు అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

KTR Tweet: తెలంగాణ సీఎం కుర్చీ రేవంత్ రెడ్డి ఎక్కిన రోజు నుంచి తెచ్చిన అప్పు 80 వేల 500 కోట్లు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. 10 నెలల్లోనే రికార్డు స్థాయిలో రికార్డు అప్పులు తెచ్చారన్నారు. అప్పు తప్పు అన్నోళ్లని.... ఇప్పుడు దేనితో కొట్టాలని ప్రశ్నించారు. ఎన్నికల హామీలేవీ తీర్చలేదన్నారు. ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదన్నారు. మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు అని నిలదీశారు. 80 వేల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లినట్లని అడిగారు.

బడా కాంట్రాక్టర్ల బిల్లులకే ధారాదత్తం చేస్తున్నారా అని ప్రశ్నించారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పు శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టి... అవే అప్పుల కోసం ముఖ్యమంత్రి పాకులాడటమేంటి అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టామని... ప్రతిపైసాతో మౌలిక సదుపాయాలు పెంచామని.... తీసుకున్న రుణంతో దశాబ్దాల కష్టాలు తీర్చామన్నారు కేటీఆర్. కానీ ముఖ్యమంత్రి తెస్తున్న అప్పుల అడ్రస్ ఎక్కడ అని ప్రశ్నించారు.

రుణమాఫీ చేయకుండా... రైతుభరోసా వేయకుండా... ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా... నెలల పాటు జీతాలు ఇవ్వకుండా... ఇన్ని వేల కోట్లు ఏమైనట్టు అని ప్రశ్నించారు. రాష్ట్ర సంపద సృష్టికి కాకుండా... సొంత ఆస్తులు పెంచుకోవడానికే చూస్తున్నారని ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories