KTR: ఫేక్ వీడియో అంటూ కౌంటర్ ఇచ్చిన సిద్ధరామయ్య
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సంబంధించి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుండటంతో, అదే సాకుగా ట్విట్టర్ వేదికగా స్పందించారు కేటీఆర్. ఎన్నికల హామీల అమలుకు డబ్బు లేదని కర్ణాటక సీఎం అన్నారని, ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తెలంగాణలో కూడా భవిష్యత్తులో ఇదే జరుగుతుందా? అంటూ ఆయన ప్రశ్నించారు. విపరీతమైన ప్రకటనలు హామీలు ఇచ్చేముందు మీకు కనీసం ఆర్థిక పరిస్థతిపై పరిశోధన ప్రణాళిక ఉండదా? అంటూ కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా ఘాటుగా వ్యాఖ్యానించారు.
అయితే తన వీడియో ప్రచారం కావడాన్ని సీఎం సిద్ధరామయ్య ఖండించారు. తాను అలా అనలేదని తన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను అక్కడక్కడ ముక్కలుగా కట్ చేసి.. ఎడిట్ చేసిన వీడియోను ప్రసారం చేశారన్నారు. ఇది డీప్ ఫేక్ వీడియోగా స్పష్టం చేశారు సిద్ధరామయ్య.
No money to deliver poll promises/guarantees says Karnataka CM !
— KTR (@KTRBRS) December 19, 2023
Is this the future template for Telangana too after successfully hoodwinking the people in elections ?
Aren’t you supposed to do basic research and planning before making outlandish statements? https://t.co/JOcc4NLsiq
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire