Huzurabad: వార్‌లోకి కేటీఆర్‌ ఎంట్రీ, ఆన్‌లైన్‌లో కేటీఆర్‌.. ఆఫ్‌లైన్‌లో హరీష్‌?

KTR Team Entry in Huzurabad
x

హుజురాబాద్‌ వార్‌లోకి కేటీఆర్‌ ఎంట్రీ

Highlights

హుజురాబాద్‌లో అధికార పార్టీ వ్యూహం మార్చిందా? ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అన్నీ ఒకేసారి గ్రౌండ్ చేయాలని డిసైడయ్యిందా?

హుజురాబాద్‌లో అధికార పార్టీ వ్యూహం మార్చిందా? ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అన్నీ ఒకేసారి గ్రౌండ్ చేయాలని డిసైడయ్యిందా? కేసిఆర్, హరీష్ రావ్ సహా, కేటిఆర్ టీం కూడా ఉన్నపలంగా హుజురాబాద్ క్షేత్రంలోకి దిగడానికి కారణమేంటి? ఓ పక్క కేసిఆర్ జిల్లాలు చుట్టొస్తూ హుజురాబాద్ కు ఇన్ డైరెక్ట్ వర్కవుట్‌ చేస్తుంటే, మంత్రి హరీష్ హైదరాబాద్‌లో వుండి, జిల్లా మంత్రులకు, లోకల్ లీడర్లకు డైరెక్షన్ ఇస్తున్నారు. ఇప్పటిదాక ఓ ఎత్తు. మనం ఎంటరైతే ఇంకో ఎత్తు అంటూ నేరుగా కేటిఆర్ రంగంలోకి దిగారు. తన కోర్ టీంకు రాత్రికి రాత్రే ఫోన్లు చేసి మూవ్ టు హుజురాబాద్ అని సీరియస్ గా చెప్పారట. అంటే కేటిఆర్ అక్కడి ప్రత్యక్ష ప్రచారంలోకి దిగబోతున్నారనే సంకేతాలిచ్చేసారు. టీఆర్‌ఎస్‌లో ఉన్న ఈ ముగ్గురు దిగ్గజాలు ఒక్కసారి గ్రౌండింగ్ కావడానికి కారణమేంటి? గులాబీదళంలో అసలేం జరుగుతోంది?

తెలంగాణలో హుజురాబాద్ బై ఎలక్షన్ రాజకీయ పార్టీలకు చావో రేవో తేల్చుకునే పరిస్థితి తెచ్చిపెట్టిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు హుజురాబాద్ కార్యక్షేత్రం చూస్తే, బై పోల్ హీట్ అప్పుడే సీరియస్ అవుతున్నట్టుంది. ఈ లెక్కన నెలరోజుల్లో నోటిఫికేషన్ వచ్చినా ఆశ్చర్యం లేదంటూ పార్టీలు సర్కస్ ఫీట్లు పడుతున్నాయి. అటు టీఆర్‌ఎస్ నుంచి మండలానికో మంత్రి, ఐదుగురు ఎమ్మెల్యేల చొప్పున రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. జనం పల్స్, లోకల్ క్యాడర్ మూడ్ తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు సిఎం కేసిఆర్ కు, మంత్రి హరీష్ కు అప్ డేట్ చేస్తున్నారు. వెంటనే హరీష్ చెప్పుకోదగ్గ లీడర్స్ పేర్లు లిస్టవుట్ చేసి, అందర్నీ పిలిపించుకుని రోజూ కండువాలు కప్పి, గులాబీ దళంలో చేర్చుకుంటున్నారు. ఒక దశలో హరీష్ రేపో మాపో హుజురాబాద్‌లో ఎంటరవుతారని భావిస్తున్న తరుణంలో, ఉన్నపలంగా కేటిఆర్ టీం ఎంటర్ కావడం, రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది.

ఈటెల ఎపిసోడ్‌లో ఎక్కడా కేటిఆర్ ఎంటర్ కాలేదు. తన కోర్ టీం ట్వీట్లు చేసినా ట్యాగ్ చెయ్యలేదు. తన టీం ఈటలపై దుమ్మెత్తిపోస్తున్నా కామ్ గానే ఉన్నారు. అరే బాస్ ఎందుకు రెస్పాండ్ కావడం లేదని పిఏలను, కేటిఆర్ ముఖ్య అనుచరులను ఆరా తీసే ప్రయత్నం చేశారు. అయినా కేటిఆర్ అంటీముట్టన్నటుగానే ఉన్నారు. ఏం జరిగిందో ఏమో కాని మొన్న సాయంత్రం ఉన్నపలంగా కేటిఆర్ కోర్ టీంకు ఫోన్లు వెళ్లాయి. అర్జంట్‌గా అన్న రమ్మంటున్నారు రావాలనడంతో ఏ ఒక్కరూ మిస్ కాకుండా క్యూరియాసిటీతో వెళ్లారు. దాదాపు నాలుగైదు గంటలు సీరియస్ గా మీటింగ్ పెట్టిన కేటిఆర్, హుజురాబాద్ పాలిటిక్స్ పై సీరియస్ గా డిస్కస్ చేశారట. ఏ మండలానికి ఎవరు వెళ్లాలి ఏ గ్రామంలో ఎవరు తిష్ట వేయాలి? ప్రచారపు ప్రణాళికలేంటి అన్న కోణంలో కేటిఆర్ సీరియస్ గా క్యాడర్ కు హితబోధ చేసారట. ఈ సీటు మన ఫ్యూచర్ పొలిటికల్ కెరీర్‌కు ఇంపార్టెంట్ అని కూడా చెప్పేసారట. సో, దీంతో క్యాడర్ తెల్లారేసరికి హుజురాబాద్ లో దిగిపోయారు.

హుజుర్ నగర్, నాగార్జునసాగర్ బై పోల్ లో కేటిఆర్ టీంలో ఎవరు బాగా చేసారు ఎవరు కంకణబద్దులై అక్కడే మకాం వేసి ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేశారో, చిట్టా తీసుకున్న కేటిఆర్, ముందుగా తన ముఖ్య అనుచరుడు, విప్ బాల్క్ సుమన్ ను రంగంలోకి దింపారు. హుజురాబాద్ క్షేత్రంలోకి వెళ్లిన సుమన్, తనదైన శైలిలో నరుక్కొస్తున్నారు. త్వరలో చిన్న బాస్ కూడా ప్రచారంలోకి వస్తారని చెప్పకనే చెబుతున్నారు. అలాగే తన కోర్ టీంలో ఉన్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సైదిరెడ్డి, కరీంనగర్‌ మేయర్ సుమన్ రావు, ఇటు మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని, శ్రీనివాస్ గౌడ్ ను పంపబోతున్నారట. సాగర్‌ ఉప ఎన్నికల్లో మండలం వారీగా, గ్రామం వారీగా పకడ్బంది ప్లాన్‌తో పనిచేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఇదే ప్లాన్ హుజురాబాద్లో వర్కౌట్‌ చేస్తున్నారు. బాల్క సుమన్, పార్టీతో, ప్రభుత్వంతో కో ఆర్డినేట్ చేస్తూ పనిచేయనున్నారు. ఓవైపు ఈటెల రాజేందర్‌పై రాజకీయ దాడి చేస్తూనే, తన పని తాను చెయ్యాలన్న వ్యూహంతో వెళ్లారు. ఒక్కో గ్రామం టార్గెట్ పెట్టి, మంత్రులు హరీష్ రావు, గంగుల, కొప్పుల గైడెన్స్ తో సాగుతూనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డైరెక్షన్ తో సామాదాన దండోపాయం ప్రయోగించి అయినా, మొత్తం పార్టీని కంట్రోల్లోకి తెచ్చుకోవాలనే టార్గెట్‌తో పని చేయబోతున్నారు.

అయితే ఎవరు అవునన్నా కాదన్నా కేసిఆర్ టూర్లు, గంటల తరబడి ప్రసంగాలు హుజురాబాద్ ఉప ఎన్నికలనుద్దేశించే అన్న చర్చ సాగుతోంది. ఓ పక్క ప్రత్యర్థి పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నామన్న నమ్మకం టిఆర్ఎస్ కు కలగడంతో పాటు, ఆ పార్టీకి హుజురాబాద్ బై పోల్ ఓ జీవన్మరణ సమస్యే. అందుకే ప్రచారం తొలి దశ నుంచే టీఆర్ఎస్‌ ముప్పెట దాడి చేయాలని డిసైడయ్యింది. ఇందులో భాగంగా తొలుత ఈటెలకు గట్టి కౌంటర్ ఇస్తూనే, అటు తర్వాత అభివృద్ది పనులు పెండింగ్ నిధుల విడుదల చేయడం లాంటివి చేస్తున్నారు.

ఇంకో పక్క మంత్రి హరీష్ ఈ ఉప ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారట. ఈటల ముద్ర తనపై పడకుండా, ఇప్పటికే అన్ని రకాలుగా జాగ్రత్త పడుతున్న హరీష్, హుజురాబాద్ ప్రచారానికి 2001 నుంచి పనిచేస్తున్న ఉద్యమ కారులే వెళ్లాలని, ఆమేరకు గ్రౌండ్ రియాల్టీస్ కేసిఆర్ కు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారట. మొత్తానికి అటు కేటీఆర్, ఇటు హరీష్‌ రావులు, హుజురాబాద్‌ సమరానికి చెరోవైపు కత్తులు దూస్తున్నారు. పోటాపోటీగా స్ట్రాటజీలు అప్లై చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories