Shabbir Ali: కేటీఆర్ నార్కోటిక్ టెస్ట్ చేయించుకోవాలి

KTR Should Undergo Narcotic Test
x

Shabbir Ali: కేటీఆర్ నార్కోటిక్ టెస్ట్ చేయించుకోవాలి

Highlights

Shabbir Ali: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నార్కో టెస్టులకు వెళ్లాలని ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Shabbir Ali: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నార్కో టెస్టులకు వెళ్లాలని ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంలో ఉన్నప్పుడు ఆరోపణలు వస్తాయని ప్రజల ముందుకు పోయి నిరూపించుకోవాలన్నారు. నార్కొటికి ఆఫీస్ కు వెళ్లి డ్రగ్స్ టెస్ట్ చేయించుకొని సర్టిఫికెట్ సంపాదించుకోవాలన్నారు. డ్రగ్స్ తో సంబంధం లేదు.. కేవలం రాజకీయ ఆరోపణలు అంటే సరిపోతుందా అన్నారు.

జన్వాడ ఫామ్ హౌస్ లో కేటీఆర్ బావమరిది లిక్కర్, పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారని.. డ్రగ్స్, క్యాసినో, ఫారిన్ లిక్కర్ ఎలా దొరికిందని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తరువాత అన్ని విషయాలు బయట పెడుతామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories