KTR: ఇవాళ హైదరాబాద్, మంచిర్యాలలో కేటీఆర్ రోడ్ షో

KTR Road Show in Hyderabad and Mancherial Today
x

KTR: ఇవాళ హైదరాబాద్, మంచిర్యాలలో కేటీఆర్ రోడ్ షో

Highlights

KTR: గోషామహల్, సికింద్రాబాద్‌లో రోడ్‌షోలో పాల్గొననున్న కేటీఆర్

KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. మూడోసారి అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో గులాబీ నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన కేటీఆర్.. తాజాగా రోడ్ షోలు ప్రారంభించారు. ముఖ్యంగా హైదరాబాద్​లో మెజార్టీ సాధించడమే లక్ష్యంగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తూ కాంగ్రెస్​, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. వారు పాలించిన సమయంలో తెలంగాణకు చేసిన అభివృద్ధి శూన్యమంటూ నొక్కిమరీ చెబుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ తో పాటు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. గోషామహల్, సికింద్రాబాద్ లో మంత్రి ఆయన రోడ్ షోలు నిర్వహించననున్నారు. మంచిర్యాలలో రోడ్ షో నిర్వహించి, జన్నారం బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. ఇప్పటికే హస్తం పార్టీపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్న కేటీఆర్..ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆరుగురు సీఎంలు మారడం మాత్రం గ్యారెంటీ అని ప్రజలకు వివరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories