KTR: మాతృభాషలో మాట్లాడ‌డం భారతీయుల హక్కు- కేటీఆర్

KTR Responded On Kerala Nurses Issue in Malayalam
x

KTR File Photo

Highlights

KTR: కేరళ నర్సులు ఢిల్లీలోని ఆసుపత్రిలో వారి మాతృభాష మలయాళంలో మాట్లాడ‌డంపై ఆసుపత్రి వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

KTR: కేరళ నర్సులు ఢిల్లీలోని ఆసుపత్రిలో వారి మాతృభాష మలయాళంలో మాట్లాడ‌డంపై ఆసుపత్రి వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేరళ నర్సులు విధుల్లో ఉన్నప్పుడు కేవలం హిందీ, ఇంగ్లీషులోనే మాట్లాడాలని ఆసుపత్రి నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ తరహా ఆదేశం భాషా ఆధిక్యత ధోరణులను తిరిగి తీసుకువచ్చినట్టుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

భారత్ లో 22 భాషలను అధికారిక భాషలుగా గుర్తించారని, వాటిలో మలయాళం, తెలుగు, తమిళం, హిందీ తదితర భాషలున్నాయని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రతి భారతీయ పౌరుడు తనకిష్టమైన భాషలో మాట్లాడుకునే హక్కు ఉందని, ఈ ప్రాథమిక హక్కుకు ఎవరూ భంగం కలిగించలేరని స్పష్టం చేశారు.

ఇక్కడ 60 శాతం మంది నర్సులు కేరళ నుంచి వచ్చినవారేనని, మాతృభాషలో మాట్లాడుకోకుండా ఎలా ఉంటారని నర్సు ప్రశ్నించారు. ఓ కేరళ నర్సు స్పందిస్తూ, గతంలో ఎన్నడూ ఇలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. ఓ రోగి తమ భాషపై ఫిర్యాదు చేసినట్టు తెలిసిందని, దాంతో సెక్రటేరియట్ నుంచే ఆదేశాలు వచ్చినట్టు వెల్లడైందని తెలిపారు.



Show Full Article
Print Article
Next Story
More Stories