Minister KTR: ప్రజల కోసం పోరాడిన కుటుంబ చరిత్ర మాది.. గర్వంగా ఫీలవుతున్నా..
Minister KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
Minister KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని, స్వాతంత్య్ర సమరాన్ని గుర్తు చేస్తూ ఆయన ఈ ట్వీట్ చేశారు. తమ కుటుంబం నుండి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని మీ అందరికీ పరిచయం చేస్తా అంటూ ట్వీట్ చేశారు. గాంధీజీ స్ఫూర్తితో తమ తాత జె.కేశవరావు 1940ల చివర్లో తెలంగాణ సాయుధ పోరులో నిజాంకు వ్యతిరేకంగా పాల్గొన్నారన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా భారత ప్రభుత్వం నుంచి గుర్తింపు కూడా పొందారన్నారు. అందుకు భారతీయుడిగా, తెలంగాణ పౌరుడిగా గర్వపడుతున్నాను అన్నారు. ప్రజా సమస్యల మీద, పేదల మేలు కోసం పోరాడిన చరిత్ర ఎవరికి ఉందంటూ ప్రశ్నించారు. కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వంలో ఎంతమంది నాయకులకు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర ఉందని ప్రశ్నించారు.
Let me introduce you all to an inspirational figure from my family: My maternal Grandfather Sri J. Keshava Rao Garu
— KTR (@KTRTRS) September 3, 2022
Inspired by Gandhi ji, he fought against the Nizam as part of Telangana Rebellion in late 1940s
He received recognition from Govt of India as a freedom fighter pic.twitter.com/s1YCR6c2vo
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire