ఆమె వివరాలు చెప్పండి.. నా వంతు సాయం చేస్తా.. : కేటీఆర్ ట్వీట్..
KTR: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు.
KTR: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఒంటి కాలుతో నడుస్తూ ఇబ్బంది పడుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఏఎన్ఐ పోస్టు చేసిన ఈ వీడియోపై కేటీఆర్ స్పందించారు. ఆమె ఆవేదనను విని కేటీఆర్ చలించిపోయారు. ఆమె వివరాలు ఉంటే ఇవ్వండి.. తన వంతు సాయం చేస్తానని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కోరారు.
బీహార్‌లోని సివాన్ జిల్లాకు చెందిన ప్రియాన్షు కుమారి ఒకే కాలుతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లి చదువుకుటోంది. తన బాల్యం నుంచి ఇలాగే వెళ్లాల్సి వస్తోందని ప్రియాన్షు ఆవేదన వ్యక్తంచేసింది. ప్రభుత్వం తనకు కృతిమ కాలు అందించాలని వేడుకుంది. తనకు డాక్టర్ కావాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్‌ఐ వార్తా సంస్థ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన కేటీఆర్ సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.
If someone at @ANI can me the girl's contact details, will be my pleasure to help (in my personal capacity) the young one achieve her dreams https://t.co/5gBoFAsIv0
— KTR (@KTRTRS) July 1, 2022
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire