ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ బ‌హిరంగ లేఖ.. ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాల భ‌ర్తీపై ప్రశ్నల పరంపర..

KTR Open Letter to PM Modi on Providing Jobs
x

ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ బ‌హిరంగ లేఖ.. ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాల భ‌ర్తీపై ప్రశ్నల పరంపర..

Highlights

KTR Letter to PM Modi: యువ‌త ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాల భ‌ర్తీపై ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ బ‌హిరంగ లేఖ రాశారు.

KTR Letter to PM Modi: యువ‌త ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాల భ‌ర్తీపై ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ బ‌హిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలన్న మోడీ ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. మరో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయబోతుంద‌న్నారు.

ప్రైవేటు రంగంలో 16 లక్షల ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించామ‌న్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, ఉన్న ఉద్యోగ అవకాశాలపై దెబ్బ కొడుతోందని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా శాశ్వతంగా లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే ITIR ప్రాజెక్టును రద్దు చేసి పెద్ద దెబ్బ కొట్టారని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories