Hyderabad: మెట్రో రైల్ సెకెండ్‌ ఫేజ్‌కు కేంద్రం నో.. మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ

KTR Letter To Center Over Hyderabad Metro Second Phase
x

Hyderabad: మెట్రో రైల్ సెకెండ్‌ ఫేజ్‌కు కేంద్రం నో.. మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ

Highlights

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశ సాధ్యం కాదన్న కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశ సాధ్యం కాదన్న కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీ సరిపోదనడం అర్ధరహితమన్నారు. వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, మీరట్ వంటి చిన్న పట్టణాలకు కేంద్రం మెట్రో ప్రాజెక్టులు కేటాయించిందని తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపిస్తుందని మండిపడ్డారు.

తెలంగాణకు ప్రాజెక్టులు ఇవ్వకుండా కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. గతంలో మెట్రో రెండోదశ డీపీఆర్‌తో సహా పూర్తి సమాచారం అందించామని.. కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌పూరి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తారని ఆశించామన్నారు కేటీఆర్. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories