లగచర్ల బాధితులకు అండగా ఉంటాం: కేటీఆర్

ktr gives assurance to lagacharla victims
x

లగచర్ల బాధితులకు అండగా ఉంటాం: కేటీఆర్

Highlights

లగచర్ల భూసేకరణ బాధితులకు అండగా ఉంటామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.

లగచర్ల భూసేకరణ బాధితులకు అండగా ఉంటామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో లగచర్ల భూసేకరణ బాధితులు శనివారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ తో సమావేశమయ్యారు. ప్రభుత్వం వేధింపులను మానుకొని బాధితుల డిమాండ్లను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు. గిరిజన భూసేకరణ బాధితులపై అన్యాయంగా పెట్టిన కేసులన్నింటిని భేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను వేధించడం మానుకోవాలని ఆయన కోరారు. వికారాబాద్ జిల్లా ఎస్పీతో టెలిఫోన్‌లో కేటీఆర్ మాట్లాడారు.

వేధింపులను నిలిపివేయాలని కోరారు.లగచర్ల భూసేకరణ బాధితుల డిమాండ్లను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామన్నారు. గిరిజన భూములను వదిలి, రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన వెల్దండలో ఉన్న 500 ఎకరాల భూములనుపరిశ్రమల కోసం తీసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు ఆర్. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఫార్మా క్లస్టర్ ఏర్పాటును నిరసిస్తూ లగచర్లలో ఈ ఏడాది నవంబర్ 11న అధికారులపై దాడికి ప్రయత్నం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా కొందరు జిల్లా అధికారులను పోలీసులు రక్షించారు. కడా అధికారి వెంకట్ రెడ్డిని గ్రామస్తులు చితకబాదారు.ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories