KTR: రేవంత్‌ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోడీ+అదానీ.. వాళ్ల బడే భాయ్ ఆజ్ఞను మాత్రం..

KTR Tweet on TGSP Constables Suspension
x

KTR: పనిభారంపై ప్రశ్నించినందుకు పోలీసులపై వేటు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ తుగ్లక్‌ నిర్ణయాలు కాదా..?

Highlights

KTR Tweet: ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు.

KTR Tweet: ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రేవంత్‌ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజన్ అంటే మోడీ, అదానీ అని.. అందుకే వాళ్లిద్దరికి కావాల్సిన పనులను చక్కబెడుతూ వారి చల్లని చూపు తనపై ఉండేలా చూసుకుంటున్నాడని రేవంత్‌ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. మూసీ పరివాహక ప్రాంతం నాశనమైనా సరే కానీ... వాళ్ల బడే భాయ్‌ ఆజ్ఞను మాత్రం రేవంత్ రెడ్డి పాటిస్తారాన్నారు. ఇటు మూసీ దిగువన రామన్నపేటలో అంబుజా సిమెంట్ ప్లాంట్ కోసం బూటకపు పబ్లిక్ హియరింగ్ నిర్వహించటం ద్వారా అదానీని సంతృప్తి పరుస్తున్నారని కేటీఆర్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

రైతును రాజును చేసింది కేసీఆర్ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డప్పుడు బియ్యం పండించడంలో తొలి 10 స్థానాల్లో లేని తెలంగాణను... ఇప్పుడు నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని కేటీఆర్ అన్నారు. నెర్రెలు బారిన నేల పచ్చబడింది, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరే రాష్ట్రమూ సాధించని అరుదైన రికార్డు సాధించి, దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారంగా ఎదిగిందీ అంటే దానికి కారణం కేసీఆర్ అంటూ కేటీఆర్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.


Show Full Article
Print Article
Next Story
More Stories