KTR: తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఉంటారు.. గుర్తు పెట్టుకో మిస్టర్ చీప్ మినిస్టర్ రేవంత్..
KTR: KCRపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
KTR: KCRపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. నువ్వు స్లిప్పర్లు వేసుకుని రాజకీయాల్లోకి వచ్చేందుకు తిరుగుతున్నప్పుడే... ఆయన తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం తన పదవికి తృణప్రాయంగా రాజీనామా చేశారన్నారు. పార్టీ టికెట్ కోసం లాబీయింగ్‌లో బిజీగా ఉన్నప్పుడే... ఆయన తెలంగాణ కావాలని స్వాప్నించాడన్నారు. ఎంతో పట్టుదలతో పోరాటం చేసి తెలంగాణ సాధించాడని తెలిపారు.
తెలంగాణ గొంతుకలను అణచివేయడానికి నువ్వు తుపాకీ పట్టుకున్నప్పుడు... ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టాడన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి నీ చేతులు డబ్బుల బ్యాగులు మోస్తుంటే... ఆయన తన మేధస్సుకు పదును పెట్టారని చెప్పారు. సాధించిన తెలంగాణను సగర్వంగా తలెత్తుకొనేలా చేసిన ఆయన... ఈ రాష్ట్రానికి గర్వకారణం అన్నారు.
ఆయన మీద పిచ్చి ప్రచారాలు చేస్తూ... దుర్భాషలాడి చరిత్ర నుంచి ఆయన పేరు చెరిపివేయవచ్చని అనుకోవటం మూర్ఖత్వమన్నారు. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఉంటారని... ఆ పేరును ఎవరు చెరిపేయలేరు గుర్తు పెట్టుకో మిస్టర్ చీప్ మినిస్టర్ రేవంత్ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.
When you were an errand boy, carrying slippers for political favors, he resigned from his position, for the people of TELANGANA!
— KTR (@KTRBRS) November 9, 2024
While you were busy lobbying for party tickets, he envisioned a dream – a TELANGANA born from struggle and perseverance
As you wielded guns to… pic.twitter.com/fpPNadoAvO
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire