KTR: కవితక్క కూడా వస్తది... జగిత్యాలలో గల్లీ గల్లీ తిరుగుతాం

KTR Fire On Jagtial MLA Sanjay Kumar
x

KTR: కవితక్క కూడా వస్తది... జగిత్యాలలో గల్లీ గల్లీ తిరుగుతాం

Highlights

KTR: కవితక్క కూడా వస్తది... జగిత్యాలలో గల్లీ గల్లీ తిరుగుతాం

KTR: కవితక్క కూడా వస్తది... జగిత్యాలలో గల్లీ గల్లీ తిరుగుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆయన బండ కట్టుకుని బావిలో దూకాడని ఎద్దేవా చేశారు. గాలికి గ‌డ్డ‌పార‌లు కొట్టుకుపోవు. గ‌ట్టి నాయ‌కులు కొట్టుకుపోరు. గాలికి కొట్టుకుపోయేది గ‌డ్డిపోచ‌లు మాత్ర‌మే. గ‌డ్డిపార‌ల్లాంటి మీరు వెళ్ల‌లేదు.. ఒక గ‌డ్డిపోచ మాత్ర‌మే కొట్టుకుపోయింది అని ఎమ్మెల్యే సంజ‌య్‌ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

క‌విత‌క్క‌తో స‌హా వేల మంది క‌ష్ట‌ప‌డితే ఆయ‌న ఎమ్మెల్యే అయిండు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే దొంగ‌ల్లో క‌లిసిండు. అభివృద్ధి కోసం పోయినా అని సంజ‌య్ అన్నాడు. జ‌గిత్యాల జిల్లా ర‌ద్దు చేస్తా.. మెడిక‌ల్, న‌ర్సింగ్ కాలేజీ ర‌ద్దు చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నందుకు సంజ‌య్ కాంగ్రెస్‌లోకి వెళ్లిండా..? రాష్ట్రంలో ఎక్క‌డా లేని విధంగా 4500 డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినందుకు ర‌ద్దు చేయ‌మ‌ని పోయావా..? ఏ అభివృద్ధి ఆశించి పోయిండు సంజ‌య్. ఆయ‌న పోయింది ఒక్క‌దాని కోసం.. ఇయ్యంకుడి బిల్లులు రావాలి.. ఆయ‌న క్ర‌ష‌ర్ ఆగొద్ద‌ని పోయిండు. సొంత అభివృద్ధి కోసం పోయిండు.. జిగిత్యాల అభివృద్ధి కోసం పోలేదు అని కేటీఆర్ పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను , కవిత ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories