Formula E Race: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్

KTR File Quash Petition in High Court
x

KTR: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్

Highlights

KTR: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం: ఫార్మూలా -ఈ కారు రేసు(Formula -E Car Race) వ్యవహారంలో తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్(KTR) తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు.

KTR: ఫార్మూలా -ఈ కారు రేసు(Formula -E Car Race) వ్యవహారంలో తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్(KTR) తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ ను విచారించే జడ్జి సీజే బెంచ్ కు వెళ్లాల్సి ఉంది. దీంతో ఈ పిటిషన్ ను విచారించేందుకు సమయం ఉండదని జడ్జి కేటీఆర్ తరపు న్యాయవాదులకు తెలిపారు.

లంచ్ మోషన్ పిటిషన్ గా స్వీకరించి మధ్యాహ్నం మూడు గంటల తర్వాతనైనా కనీసం ఐదు నిమిషాలు తమకు సమయం ఇవ్వాలని కోరారు. దీనిపై సీజే బెంచ్ వద్ద అనుమతి తీసుకోవాలని కేటీఆర్ తరపు న్యాయవాదులకు సూచించారు. దీంతో సీజే వద్ద ఈ విషయాన్ని కేటీఆర్ న్యాయవాదులు ప్రస్తావించారు. అత్యవసరంగా ఈ కేసును విచారించేందుకు జ్యుడిషీయల్ రిజిస్ట్రార్ కు నోట్ పెట్టాలని సీజే సూచించారు.ఫార్మూలా-ఈ కారు రేసులో నిబంధనల ఉల్లంఘించి నిధులు ట్రాన్స్ ఫర్ చేయడం, అగ్రిమెంట్ చేసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు అనుమతి ఇచ్చింది.

దీంతో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ1 గా కేటీఆర్ పేరును ఏసీబీ చేర్చింది. ఏ2 గా అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పేరును చేర్చారు.జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేశారు.భోజన విరామం తర్వాత పిటిషన్ ను విచారించాలని కేటీఆర్ కోరారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 2022 అక్టోబర్ లో ఫార్మూలా-ఈ కారు రేసుపై ఒప్పందం జరిగింది.ఈ ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి లో ఫార్మూలా-ఈ కారు రేసును నెక్లెస్ రోడ్డులో నిర్వహించారు. 10, 11 సీజన్ నిర్వహణకు సంబంధించి ప్రమోటర్ ముందుకు రాలేదు. దీంతో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఫార్మూలా ఈ కారు రేసు నిర్వాహకులతో పురపాలక శాఖ ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి అప్పట్లో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీంతో కేటీఆర్ పై గవర్నర్ అనుమతితో కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories