సంక్రాంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి నేనిచ్చే ఆఫర్ ఏంటంటే.. - కేటీఆర్

KTR press meet in Formula E Car race case
x

ఈడి విచారణ అనంతరం మీడియాతో కేటీఆర్

Highlights

KTR Formula E Car race case: కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. హైదరాబాద్‌లో ఈడీ ఆఫీస్ నుండి బయటికొచ్చిన తరువాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. విచారణకు ఇంకా...

KTR Formula E Car race case: కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. హైదరాబాద్‌లో ఈడీ ఆఫీస్ నుండి బయటికొచ్చిన తరువాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా. ఎన్నిరకాల పరీక్షలు పెట్టినా భరిస్తా అని కేటీఆర్ అన్నారు. నిజాయితీ అల్టీమేట్ గా గెలుస్తది, న్యాయం, ధర్మం గెలుస్తదని చెప్పారు. హైకోర్టులున్నాయి, సుప్రీం కోర్టులున్నాయి, న్యాయమూర్తుల మీద విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. ఈరోజు కాకపోయినా ఇంకో నాలుగు రోజులకైనా వాస్తవాలు ప్రజలకు తెలుస్తుందన్నారు. తప్పకుండా న్యాయమే గెలుస్తుందనే విశ్వాసం ఉందని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.

తప్పు చేయలేదు... తప్పు చేయబోం. ఇందులో అరపైసా అవినీతి జరగలేదు. ఇక తప్పు ఎక్కడ జరిగిందన్నారు. మనీలాండరింగ్ ఎక్కడ జరిగిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత 8 గంటలపాటు జరిగిన విచారణలో ఈడీ అధికారులకు ఇదే విషయం చెప్పాను. తప్పు చేసి ఉంటే రుజువు చేయండి ఏ శిక్ష వేసినా సిద్ధమే అని అధికారులకు చెప్పానని కేటీఆర్ మీడియాకు తెలిపారు.

రేవంత్ రెడ్డికి నేనిచ్చే సంక్రాంతి తోఫా ఇదే

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ... ముఖ్యమంత్రికి సంక్రాంతి సందర్భంగా ఒక బహుమతి ఆఫర్ ఇస్తున్నానని అన్నారు. "ఓటుకు నోటు కేసులో 2015 లో ఏసీబీ మీపై (రేవంత్ రెడ్డి) కేసు నమోదు చేసింది. అదే కేసులో ఈడీ కూడా కేసు నమోదు చేసి చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ కేసులో ఇప్పటికీ మీరు విచారణ ఎదుర్కుంటున్నారు. మీరు విచారణ ఎదుర్కుంటున్నారని నాపై కూడా కేసు పెట్టారు" అని కేటీఆర్ ఆరోపించారు.

అయినాసరే ఈ కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ అన్నారు. కానీ మీకు నేనిచ్చే ఆఫర్ ఏంటంటే... "మీరు ఒక తేదీ, వేదిక ఖరారు చేస్తే ఇద్దరం కలిసి లై డిటెక్టర్ టెస్టులో పాల్గొందాం" అని ఆయన ముఖ్యమంత్రికి సవాల్ చేశారు. అందరూ చూస్తుండగా లై డిటెక్టర్ టెస్టులో పాల్గొంటే మనిద్దరిలో ఎవరు అబద్దం చెబుతున్నారో అందరికీ అర్థమవుతుందని అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories