KTR: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీపై కేటీఆర్ విమర్శలు

KTR criticizes Congress government loan waiver
x

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీపై కేటీఆర్ విమర్శలు

Highlights

KTR: 40 లక్షల రైతుల్లో మెజారిటీ రైతులకు నిరాశే మిగిలింది

KTR: తెలంగాణ ప్రభుత్వం చేసిన రుణమాఫీని చూస్తే చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్లు ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ట్విటర్ వేదికగా రేవంత్ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అన్నారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలు అయ్యాయని ఆరోపించారు. అన్నివిధాలా అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేవారు లేరన్నారు. రైతన్నలు తమ గోడు చెప్పుకుందామంటే వినేవారు లేరని కేటీఆర్ అన్నారు. అర్హులైన లబ్దిదారులు రుణమాఫీ కాక అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలని ప్రశ్నించారు.

నలభై లక్షల మందిలో మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా లేక 30 లక్షల మందిని మోసం చేసినందుకా అని కేటీఆర్ రేవంత్ సర్కారును నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సీజన్లు అయినా రైతుభరోసా ఇంకా ప్రారంభించలేదని విమర్శించారు. జూన్​‌లో పడాల్సిన రైతుభరోసా నిధులను జులై వచ్చినా రైతుల ఖాతాలో జమచేయలేదని కేటీఆర్ మండిపడ్డారు. కౌలు రైతులకు ఇస్తానన్న 15 వేల రూపాయలు కూడా ఇవ్వలేదని, రైతు కూలీలకు 12 వేల రూపాయల హామీ ఇంకా అమలు చెయ్యలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మభ్యపెట్టే పాలన అంటూ విమర్శించారు. ఇంతకాలం అటెన్షన్ డైవర్షన్, ఇప్పుడేమో ఫండ్స్ డైవర్షన్ అని ఎద్దేవా చేశారు కేటీఆర్.


Show Full Article
Print Article
Next Story
More Stories