KTR: మహబూబ్నగర్పట్టణంలో పలు నిర్మాణాల కూల్చివేతలపై స్సందించిన కేటీఆర్
KTR: కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేసిన కేటీఆర్
KTR: మహబూబ్నగర్పట్టణంలో పలు నిర్మాణాల కూల్చివేతలపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణను మరో "బుల్డోజర్ రాజ్ " కానివొద్దని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం, చట్టాలనూ ఉల్లంఘిస్తూ పేదలకు గూడు లేకుండా చేసే ప్రయత్నాన్ని మీరు సమర్థిస్తున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇళ్లను కూల్చకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించాలని ఖర్గేను కోరారు. ఒకరి ఇంటిని కూల్చివేసి వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చటం అమానవీయం.
అన్యాయం అంటూ గతంలో మీరే అన్నారని ఖర్గేను ఎక్స్‌లో ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణలో చట్టాన్ని ఉల్లంఘిస్తూ పేదల జీవితాలను ఆగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మీ ప్రభుత్వం కూల్చేసిన 75 కుటుంబాల ఇళ్లలో 25 కుటుంబాలు వికలాంగులకు చెందినవేనని ఖర్గేకు తెలిపారు కేటీఆర్.
Dear Kharge Ji,
— KTR (@KTRBRS) August 30, 2024
As you said, demolishing someone’s home and rendering their family homeless is both inhumane and unjust
This is exactly what is happening in Telangana with utter contempt for law & judiciary. Below is a video of Mahbubnagar town where 75 houses of poor have been… https://t.co/HlneWWBVlj pic.twitter.com/8qJJeeDQ45
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire