KTR: సేఫ్‌ గేమ్‌ వద్దు.. స్ట్రయిట్‌ ఫైట్‌ చేద్దాం.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్

KTR Challenge To CM Revanth Reddy
x

KTR: సేఫ్‌ గేమ్‌ వద్దు.. స్ట్రయిట్‌ ఫైట్‌ చేద్దాం.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్

Highlights

KTR: త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రోడ్డెక్కే పరిస్థితులు వచ్చాయి

KTR: సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్ విసిరారు. సేఫ్‌ గేమ్‌ వద్దు.. స్ట్రయిట్‌ ఫైట్‌ చేద్దామన్న కేటీఆర్.. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేద్దామన్నారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసి పోటీ చేస్తానని, సీఎం, ఎమ్మెల్యే పదవికి రేవంత్‌ రాజీనామా చేసి పోటీ చేయాలని, మల్కాజ్‌గిరిలో తేల్చుకుందామంటూ సవాల్‌ విసిరారు కేటీఆర్. రేవంత్‌కు దమ్ముంటే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయాలని, మహిళలకు 2 వేల 500 మహాలక్ష్మి స్కీమ్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే.. బీసీ, ఎస్సీ సబ్‌ ప్లాన్‌ తక్షణమే అమలు చేయాలన్నారు కేటీఆర్‌.

తనను ప్రతిసారి మేనేజ్‌మెంట్‌ కోటా అని విమర్శిస్తున్న రేవంత్‌రెడ్డి.. రాహుల్‌, ప్రియాంకగాంధీలు ఏంటో చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డిది పేమెంట్‌ కోటా అని విమర్శనాస్త్రాలు సంధించిన కేటీఆర్‌.. పేమెంట్‌ కోటాలో సీటు తెచ్చుకున్నందుకు రేవంత్‌ ఢిల్లీకి పేమెంట్‌ చేయాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటికే బిల్డింగ్‌ పర్మిషన్లు ఆపేశారని ఆరోపించిన కేటీఆర్.. కాంగ్రెస్‌ బిల్డర్లను బెదిరించాలి.. వ్యాపారులను బెదిరించాలి.. ఢిల్లీకి కప్పం కట్టాలి.. బ్యాగులు మోయాలని విమర్శించారు. త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రోడ్డెక్కే పరిస్థితులు వచ్చాయన్నారు కేటీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories