Raj Pakala: జన్వాడ పార్టీ కేసులో రాజ్ పాకాలకు తెలంగాణ హైకోర్టులో ఊరట

Raj Pakala: జన్వాడ పార్టీ కేసులో రాజ్ పాకాలకు తెలంగాణ హైకోర్టులో ఊరట
x
Highlights

Ktr's brother in law Raj Pakala Rave party case: రాజ్ పాకాల పోలీసుల విచారణకు హాజరు కావడానికి రెండు రోజుల సమయం ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. తనను...

Ktr's brother in law Raj Pakala Rave party case: రాజ్ పాకాల పోలీసుల విచారణకు హాజరు కావడానికి రెండు రోజుల సమయం ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. తనను అన్యాయంగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది. పోలీసుల దర్యాప్తులో సమాచారం లేదా ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు ఏఏజీ చెప్పారు. నిబంధనల ప్రకారంగానే ముందుకు వెళ్లాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

అక్టోబర్ 26న రాజ్ పాకాలకు చెందిన ఫాంహౌస్ లో పార్టీ జరిగింది. ఈ పార్టీకి అనుమతిలేదని ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు రాజ్ పాకాలకు నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉంది. తన న్యాయవాదుల ద్వారా ఆయన ఓ లేఖ పంపారు. విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజుల సమయం ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. ఈ లేఖను పోలీసులకు అందించారు న్యాయవాదులు.

కుట్రపూరితంగానే రాజ్ పాకాలపై కేసు నమోదు చేశారని ఆయన తరపు న్యాయవాది మయూర్ రెడ్డి హైకోర్టు దృష్టికి తెచ్చారు. గృహ ప్రవేశాన్ని పురస్కరించుకొని దివాలీ పార్టీ ఇచ్చారని.. ఇందులో లిక్కర్ ఉండడంతో ఈ కేసు పెట్టారని ఆయన చెప్పారు. ఈ పార్టీకి హాజరైన విజయ్ మద్దూరికి డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినందున రాజ్ పాకాలపై కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో కోర్టు విచారణకు హాజరైతే రాజ్ పాకాలను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున తన క్లయింట్ కోర్టును ఆశ్రయించారని ఆయన వాదనలు వినిపించారు.

మేం నోటీసులు జారీ చేశాం. అరెస్ట్ చేస్తామని ఎక్కడా చెప్పలేదని ఏఏజీ వాదించారు. నోటీసులకు స్పందించలేదు. విచారణకు రాలేదని ఆయన చెప్పారు.విచారణలో ఆధారాలు లభ్యమైతే చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు ఏఏజీ తెలిపారు. అయితే ఈ సమయంలో రాజ్ పాకాల తరపు న్యాయవాది జోక్యం చేసుకున్నారు. ఉదయం తొమ్మిదిన్నరకు నోటీసులిచ్చి పదకొండున్నర గంటలకు విచారణకు రావాలని కోరారని....సమయం తక్కువగా ఉన్నందునే విచారణకు హాజరుకాలేకపోయినట్టుగా ఆయన వాదించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories