KTR: ఫాక్స్‌కాన్‌ కంపెనీ శంకుస్థాపన చరిత్రలో నిలిచిపోతుంది

KTR About Foxconn Company Foundation
x

KTR: ఫాక్స్‌కాన్‌ కంపెనీ శంకుస్థాపన చరిత్రలో నిలిచిపోతుంది

Highlights

KTR: రానున్న పదేళ్లలో 15 లక్షల మందికి ఉపాధి

KTR: ఈ రోజు కొంగ‌ర్ క‌లాన్‌లో ఫాక్స్‌కాన్ మొద‌టి ప్లాంట్‌ల శంకుస్థాప‌న కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ సంస్థ ఫాక్స్‌కాన్‌ తమ పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంచుకున్నందుకు ఆనందంగా ఉందని కేటీఆర్‌ అన్నారు. . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.తొమ్మిదేళ్లుగా రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు పెడుతోందన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు.ఎలక్ట్రానిక్స్‌ రంగం ప్రాధాన్యత ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ రంగంలో పదేళ్లలో 15 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని కేటీఆర్ తెలిపారు. 20 ఏళ్లలోనే చైనా సాధించిన ప్రగతిని మనం సాధించే అవకాశముంది .ఆ దిశగానే తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

దేశంలోని ఐటీ ఉద్యోగాల్లో ప్రతి మూడింట్లో ఒక ఉద్యోగం మనదే. మరో పదేళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.ఒప్పందం ప్రకారం రెండున్నర నెలల్లోనే ఫాక్స్‌కాన్‌ పరిశ్రమకు సంబంధించిన శంకుస్థాపన పూర్తి చేశాం. సంస్థకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఏడాదిలోగా పాక్స్‌కాన్‌ పరిశ్రమ పూర్తి కావాలని కోరుకుంటున్నాం. ఈ కంపెనీలో మొదటి దశలో 25వేల ఉద్యోగాలు లభిస్తాయి. యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం'' అని కేటీఆర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యాంగ్‌ లియూ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories