Telangana: ఒక బంధువుగానే ఈటలను కలిశా...కొండా విశ్వేశ్వర రెడ్డి

Konda Vishweshwar Reddy Comments On Etela Rajender
x

Konda Vishweshwar Reddy:(File Image)

Highlights

Telangana: తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్‌కు అలవాటేనని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు.

Telangana: ఒక బంధువుగానే మాజీ మంత్రి ఈటలను కలిశానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్‌తో భేటీ అనంతరం కొండా విశ్వేశ్వరెడ్డి విలేకరులతో మాట్లాడారు. శామీర్‌పేటలోని ఈటల ఇంటికి వచ్చిన కొండా దాదాపు గంటపాటు చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించారనే వార్త విని సానుభూతి తెలిపానన్నారు. రాజకీయ నాయకుడిగా ఈటల నివాసానికి వెళ్లలేదని, రాజకీయాలు మాట్లాడలేని పేర్కొన్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్‌కు అలవాటేనని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్‌కు అలవాటేనని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు.

రాజకీయంగా జరిగిన విషయాలను పట్టించుకోవద్దని, అవమానకరంగా భావించొద్దని చెప్పేందుకే మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసినట్లు కొండా విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ''నేను రాజకీయాలపై చర్చించేందుకు ఈటల ఇంటికి రాలేదు. సానుభూతి తెలియజేసేందుకే వచ్చాను. ఈటల సతీమణి జమునా రెడ్డి నా సమీప బంధువు. ఈటల ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ప్రజలు ఆయన వెంట ఉంటారని చెప్పాను. ఇతర విషయాలు ఏమీ మాట్లాడలేదు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఇదొకటి'' అని కొండా వివరించారు.

టీఆర్ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి 2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన కాంగ్రెస్‌కు కూడా దూరమయ్యారు. పార్టీపై వివిధ సందర్భాల్లో అసహనం కూడా వెళ్లగక్కారు. ఆ తర్వాత ఆయన భవిష్యత్ కార్యచరణ ప్రకటించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories