Konda Surekha: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి అధికారులు సహకరించాలి

Konda Surekha in the Preparatory Meeting of Praja Palana
x

Konda Surekha: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి అధికారులు సహకరించాలి 

Highlights

Konda Surekha: ప్రజల వద్దకే పాలన చేరే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలి

Konda Surekha: రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజా పాలనపై సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రి హాజరయ్యారు. మంత్రి అయిన తరువాత జిల్లాకు మొదటి సారి కొండా సురేఖ రావడంతో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ,అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అర్హులకు ఆరు గ్యారెంటీ హామీలు అమలు చేయాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా పాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తిస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories