Konda Surekha: నీలం మధును గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాస్వామ్యం గెలిచినట్టు…

Konda Surekha Election Campaign For Neelam Madhu
x

Konda Surekha: నీలం మధును గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాస్వామ్యం గెలిచినట్టు…

Highlights

Konda Surekha: బీఆర్ఎస్ గెలిస్తే .. కెసిఆర్ ఎంపీలను తాకట్టు పెడతాడు

Konda Surekha: పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిస్తే మాజీ సీఎం కేసీఆర్ ఆయన కూతురి కోసం ఎంపీలను తాకట్టు పెడతాడని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇంచార్జి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సాపూర్ నియోజకవర్గ పట్టణ కేంద్రంలోని సాయి కృష్ణ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు కాంగ్రెస్ పాలనపై ఇష్టారీతిన విరుచుకుపడుతున్నాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలే అయిందని, పథకాల అమలుపై సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో మీరేం చేశారో? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకు లేదని స్పష్టం చేశారు. మెదక్ ఎంపీ స్థానానికి ప్రత్యేకత ఉందని, ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సోనియా, రాహుల్ గాంధీలు సంతోషపడతారని అన్నారు. పట్టుదలతో పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించుకుంటే, బీఆర్ఎస్ వారికి తగిన గుణపాఠం చెప్పిన వాళ్ళమవుతామని కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి సురేఖ సూచించారు.

తొమ్మిదిన్నర ఏళ్లలో లక్ష కోట్లు అప్పు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దేనని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అసైన్డ్ భూములు, 55 వేల ఎకరాల భూమి స్వాహా, వక్ఫ్ భూములను కూడా కాజేసీ సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లేందుకు సంవత్సరానికి 80 కోట్లు ఖర్చు చేసిన వ్యక్తి అన్నారు. డబ్బుతో రాజకీయాలను బ్రష్టు పట్టించారని ఆరోపించారు. 500, వెయ్యి రూపాయలకు ఓట్లను కొంటున్నారు అన్నారు. పార్టీలు ప్రలోభాలకు లొంగి ఓట్లను అమ్ముకోవద్దని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో డబ్బులతోనే బిఆర్ఎస్ గెలిచిందని అన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో 40వేల దొంగ ఓట్లను సృష్టించారని పేర్కొన్నారు. వాల దగ్గర దోచుకున్న డబ్బులతో అది చేస్తాం ఇది చేస్తామని మన ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. వారి మాటలు నమ్మితే మరోసారి మోసపోతామన్నారు. నీలం మధు వార్డు మెంబర్‌ నుంచి పైస్థాయికి వచ్చిన వ్యక్తి కనుక కార్యకర్తల బాధ తెలుసన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

మెదక్ గడ్డ నుంచి పోటీ చేసి ప్రధాని అయిన ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ స్థానం నుంచి తనకు పోటీ చేసే అవకాశం రావడం, తన పూర్వజన్మ సుకృతమని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో ఈ ప్రాంతానికి అనేక ఫ్యాక్టరీలను, కంపెనీలను తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించిందన్నారు. తనను గెలిపిస్తే మెదక్ ప్రాంతా అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ప్రజాసేవ చేస్తానని నీలం మధు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ , సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి, మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, రవీందర్ రెడ్డి, సుభాషిని , జిల్లా కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ మండల, కాంగ్రెస్ ఎంపీపీ, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories