Mallanna Kalyanam: కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి సర్వం సిద్ధం

Komuravelle Mallanna Kalyanam Celebration 26.12.2021 | Telangana News Online
x

 కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి సర్వం సిద్ధం

Highlights

Mallanna Kalyanam: మంత్రోచ్ఛారణల మధ్య ముక్కోటి దేవతలు.. పంచభూతాల సాక్షిగా కోరమీసల కొమురవెళ్లి మల్లన్న వివాహం

Mallanna Kalyanam: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లి మల్లన్న పెండ్లిఘడియాలు సమీపిస్తున్నాయి. ఆలయ ప్రాంగణం వద్ద తోటబావి వద్ద కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మండపంలో ఈ నెల 26న అశేష జనవాహిని, భక్తుల మధ్య ముత్యాల పందిరిలో, వీరశైవుల ఆడబిడ్డ అయిన మేడలదేవికి, యాదవుల ఆడబిడ్డ అయిన గోళ్లకేతమ్మకు మల్లన్న వివాహం జరగనుంది. వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ముక్కోటి దేవతలు, పంచభూతాల సాక్షిగా కోరమీసల కొమురవెళ్లి మల్లన్న వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.

దీనికి గాను ఆలయ పరిసరాలు మామిడి తోరణాలతో, స్వామివారి రాజగోపురం విద్యుత్తు దీపకాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. స్వామివారి కల్యాణాన్ని తిలకించడానికి సుమారు 50 వేల మంది భక్తులు హాజరవుతారని ఆలయాధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories