వివాదాస్పదంగా టీపీసీసీ చీఫ్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు...

Komatireddy Venkat Reddy Comments on TPCC Chief Revanth Reddy Making Issue in T Congress
x

వివాదాస్పదంగా టీపీసీసీ చీఫ్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు...

Highlights

Komatireddy Venkat Reddy: సొంత పార్టీ నేతల నుండి తీవ్ర విమర్శలు వస్తుండడంతో సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారా..?

Komatireddy Venkat Reddy: రాహుల్ గాంధీ పర్యటన జన సమమీకరణ సమీక్షా సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిని తన జిల్లాకు రావద్దన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. పీఏసీ సమావేశంలో నల్గొండ ఇష్యూ పై చర్చించాలని కొంతమంది పట్టుబట్టగా... దానిని మానిక్కం ఠాగూర్ తరువాత చర్చిద్దామని చెప్పారు.

కానీ గాంధీ భవన్ కి వచ్చిన ప్రతి ఒక్క నేత కోమటిరెడ్డి వ్యాఖ్యలు సరైనవి కావని... పిసిసి చీఫ్ రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించవచ్చని తేల్చేశారు. కొంతమంది నాయకులు ఒక అడుగు ముందుకేసి కచ్చితంగా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవైపు రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించిన సన్నాహక సమావేశం కార్యక్రమం సొంత జిల్లాలో జరుగుతుండగా ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారై కేంద్రమంత్రి గడ్కరీ ప్రోగ్రాం లో కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఇదంతా ఏఐసిసి నిశితంగా పరిశిలిస్తుందని పార్టీ నేతలు హెచ్చరిస్తుండడంతో కోమటిరెడ్డి దానిని సరిదిద్దుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.

సొంత నేతల నుండి తీవ్ర విమర్శలు వస్తుండడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏఐసిసి ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ ని కలిసి వివరించే ప్రయత్నం చేశారు. తాను వేరే ఏ ఉద్దేశ్యంతో పిసిసి చీఫ్‌ ని నల్గొండ కి రావద్దని చెప్పలేదని...ఇక్కడ మేము బలమైన నేతలం ఉన్నామని... ఇప్పటికే జనసమీకరణ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామని కోమటిరెడ్డి ఠాగూర్ కి చెప్పినట్లు సమాచారం. బలహీనంగా ఉన్న జిల్లాలైనా ఆదిలాబాద్, నల్గొండ లాంటి జిల్లాలో పిసిసి చీఫ్ పర్యటిస్తే బాగుంటుందని అన్నట్లు వివరించారు.

అక్కడ కనీస నాయకత్వ లేమితో పార్టీ ఇబ్బందులు పడుతుందని...అక్కడ వాహనాల సౌకర్యాలు జనసమీకరణ పై సమీక్ష చేస్తే బాగుంటుందని తన ఉదేశ్యంగామాట్లాడానని ఠాగూర్ కు కోమటిరెడ్డి వివరించారట. కేంద్రమంత్రి గడ్కరీ రహదారులకు సంబంధించిన తన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం ఉండడం వల్ల నాగార్జున సాగర్ సమావేశానికి హాజరుకాలేదని వివరించినట్లు సమాచారం. అయితే రాహుల్ గాంధీ పర్యటన దగ్గర పడుతుండడంతో ఠాగూర్ తో కోమటిరెడ్డి భేటీ వివాదాలకు తెరపడ్డాటేనా లేదంటే మళ్ళీ మొదటికే వస్తుందేమో చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories