కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Komatireddy Raj Gopal Reddy joined the Congress Party
x

కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Highlights

Komatireddy Raj Gopal Reddy: రాజగోపాల్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన.. ఏనుగు రవీందర్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌

Komatireddy Raj Gopal Reddy: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో నిన్న రాత్రి ఢిల్లీలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్‌లు కాంగ్రెస్‌లో చేరారు. ఈరోజు ఢిల్లీలో రాజగోపాల్ రెడ్డి సహా పార్టీలో చేరిన కీలక నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేను కలవనున్నారు. కాగా, మునుగోడు నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి బరిలో దిగనున్నారు.

ఇప్పటికే రాహుల్ కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ కూడా లభించినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తన వద్ద ఉన్న వ్యూహాలను రాజగోపాల్ రెడ్డి రాహుల్‌కు వివరించనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్న సమయంలో ఆకస్మికంగా కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్ రెడ్డికి గ్రౌండ్ లెవల్ నుంచి పార్టీ కార్యకర్తలు, లీడర్ల నుంచి సహకారం లభిస్తుందా? లేదా? అనేది సందిగ్ధంలో ఉన్నది. అయితే ఇప్పటికే మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం పాల్వాయి స్రవంతి, క్రిష్ణారెడ్డిలు పోటీ పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories