Kishan Reddy: రాష్ట్రంలో కుటుంబ మాఫియా నడుస్తుంది.. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్న కిషన్‌రెడ్డి

Kishan Reddy attended the Secunderabad Cantonment Sabha as the Chief Guest
x

Kishan Reddy: రాష్ట్రంలో కుటుంబ మాఫియా నడుస్తుంది.. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్న కిషన్‌రెడ్డి

Highlights

Kishan Reddy: సికింద్రాబాద్ కంటోన్మెంట్ సభలో ముఖ్యఅతిథిగా హాజరయిన కిషన్ రెడ్డి

Kishan Reddy: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రజల్ని కోరారు. కంటోన్మెంట్ ఆరో వార్డులోని సాయిబాబా కాలనీ వద్ద ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రజల సమస్యను తెలుసుకునే నాయకుడిగా ఉన్న శ్రీ గణేష్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.

కంటోన్మెంట్ నియోజకవర్గం రక్షణశాఖ ఆధీనంలో పాలనలో ఉంటుందని వారితో చర్చించి సమస్యలను పూర్తి విధంగా పరిష్కరించే దిశగా ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కుటుంబ మాఫియా నడుస్తుందని రాబోయేది బీజేపి ప్రభుత్వమేనన్నారు. బీసీని ముఖ్యమంత్రి చేసి ప్రజల సమస్యను వెంటవెంటగా పరిష్కరించే విధంగా పాలన నడుస్తుందని.. తద్వారా ప్రజలకు కష్టాలు తీరుతాయని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories