మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం

మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం
x
Highlights

మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కేసు విషాదంతమయ్యింది. మహబూబాబాద్‌ శివారులో దీక్షిత్‌ మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తోంది. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి...

మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కేసు విషాదంతమయ్యింది. మహబూబాబాద్‌ శివారులో దీక్షిత్‌ మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తోంది. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మానుకోటకు 5 కిలోమీటర్ల దూరంలో హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.

దీక్షిత్ కిడ్నాప్ కాస్త మర్డర్ కేసుగా మలుపు తిరిగింది. ఈ నెల 18న బాలుడిని కిడ్నాప్‌ చేసిన దుండగులు 45 లక్షల డబ్బులు డిమాండ్‌ చేశారు. దీంతో డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేశారని అందరూ భావించారు. సుమారు పది టీమ్‌లు నాలుగు రోజులుగా బాలుడి కోసం ముమ్మరంగా గాలించారు. అయితే ఊహించని విధంగా కేసు మలుపు తిరిగింది.

కిడ్నాపర్ల డిమాండ్ మేరకు దీక్షిత్‌ పేరెంట్స్‌ 45 లక్షల డబ్బును సిద్ధం చేశారు. డబ్బులు పోయిన పర్వాలేదు తమ బిడ్డ ప్రాణాలు దక్కితేచాలని తల్లిదండ్రులు భావించారు. అందుకే కిడ్నాపర్‌లు చెప్పిన అడ్రస్‌కు బాలుడి తండ్రి 45 లక్షల రూపాయలు తీసుకొనివెళ్లాడు. రాత్రంతా అక్కేడే ఎదురుచూసినా కిడ్నాపర్లు రాకపోవడంతో నిరాశకు వెనుదిరిగాడు. అయితే అప్పటికే కిడ్నాపర్లలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తిని విచారించగా అసలు విషయం బయటపడింది.


Show Full Article
Print Article
Next Story
More Stories