BRS Avirbhava Sabha: ఖమ్మం సభ విజయవంతం.. బీఆర్ఎస్ శ్రేణుల్లో సమరోత్సాహం

Khammam BRS Sabha Is Successful
x

BRS Avirbhava Sabha: ఖమ్మం సభ విజయవంతం.. బీఆర్ఎస్ శ్రేణుల్లో సమరోత్సాహం

Highlights

BRS Avirbhava Sabha: ఖమ్మం వేదికగా కేంద్ర ప్రభుత్వానికి సంకేతాలు జారీ

BRS Avirbhava Sabha: భారత రాష్ట్ర సమితి ఖమ్మం ఆవిర్భావ సభలో ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతుతో నిర్వహించిన సభలో కేంద్రప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు చేశారు. రాష్ట్రాలు వేరైనా అందరి ముఖ్యమంత్రులది ఒకటే ఆలోచన, ఆశమయమనే సంకేతాలిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. అందరు ముఖ్యమంత్రులు మాట్లాడిన తర్వాత సభకు సారథ్యం వహించిన ఉద్యమనేత కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ విధానం ప్రైవేటీకరణ అయితే భారత రాష్ట్ర సమితి జాతీయకరణ విధానమని సంకేతాలిచ్చారు. బీఆర్ఎస్ కు అధికారం అందిస్తే తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ, దళిత బంధు, రైతు బంధు, ఉచిత విద్యుత్తు వంటి పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేస్తామని ప్రకటించారు.

ఖమ్మంలో నిర్వహించిన భారత రాష్ట్ర సమితి శంఖారావం సభ తెలంగాణ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచింది. సభ నిర్వహణ, జనసమీకరణ బాధ్యతలను ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరును కేసీఆర్ సభలో ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందించారు. సభ విజయవంతంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సమరోత్సాహం నెలకొంది. సభకు వచ్చిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ము‌ఖ్యమంత్రి భగవంత్ మాన్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌లు, కమ్యూనిస్టు నేత డి.రాజా సభ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. సంఘీభావాన్ని ప్రకటించేందుకు వచ్చిన అతిథులను వెండి వీణల జ్ఞాపికలతో గౌరవంగా సత్కరించి సాగనంపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories