BRS: ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ BRS అభ్యర్థులు ఖరారు

Khammam And Mahabubabad Lok Sabha BRS Candidates Finalized
x

BRS: ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ BRS అభ్యర్థులు ఖరారు

Highlights

BRS: కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలి

BRS: లోక్‌సభ ఎంపీ అభ్యర్థులపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్..తాజాగా మరో ఇద్దరి అభ్యర్థులను కన్ఫామ్ చేసింది.. ఖమ్మం బీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థిగా నామా నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిగా మాలోత్‌ కవిత పేరును ఖరారు చేశారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో..ఇద్దరు సిట్టింగ్‌లకు మరోసారి చాన్స్‌ ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలోనే ఖమ్మం మహబూబాబాద్ నేతలకు దిశానిర్దేశం చేశారు గులాబీ బాస్. త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.

జిల్లాలో పార్టీ ఓడిపోయినా నేతలు మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్ళాలని..కేసీఆర్ సూచించారు. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు సమన్వయకర్తలను నియమిస్తామని వెల్లడించారు. పలువురు నేతలు బీఆర్ఎస్ ను వీడుతున్న నేపథ్యంలో..కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.. కొంత మంది పార్టీని వీడినంత మాత్రానా.. బీఆర్ఎస్‌కు ఎలాంటి నష్టం లేదన్నారు.. ఎన్టీఆర్ లాంటి నేతకు రాజకీయాల్లో ఒడిదుదుకులు తప్పలేదని.. ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అభిప్రాయపడ్డ గులాబీబాస్.. ఆ వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం, మహబూబాబాద్ పార్టీ శ్రేణులకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories