Tamilisai : ఉగాది వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

Key Remarks by Governor Tamilsai During Ugadi Celebrations
x

Tamilisai : ఉగాది వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు 

Highlights

Tamilisai Soundararajan: *ప్రభుత్వ పెద్దలు తన ఆహ్వానాన్ని పట్టించుకోవడం లేదు *తనకు ఎలాంటి ఇగో లేదు

Tamilisai Soundararajan: రాజ్ భవన్‌లో జరిగిన ఉగాది ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను ఉగాది ఉత్సవాలకు ఆహ్వానించినా వారు ఎవరు రాలేదని గవర్నర్ తమిళిసై తీవ్ర అసంత్రృప్తి వ్యక్తం చేశారు. ప్రతిసారి ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించినా వారు నా ఆహ్వానాన్ని పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. యాదాద్రి సంప్రోక్షణకు తనకు వెళ్లాలని ఉన్నా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందలేదని అందుకు తన గౌరవానికి ఎలాంటి భంగం కలిగినట్లు భావించడం లేదన్నారు. ప్రగతి భవన్‌లో ప్రభుత్వం నిర్వహించే ఉగాది వేడుకలకు ఆహ్వానిస్తే తప్పకుండా హాజరవుతానని పేర్కొన్నారు.

రాజ్ భవన్ లో ఉగాది ఉత్సవాలను గవర్నర్ తమిళిసై ఆధ్వర్యలో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు , ఎమ్మెల్యేలు రఘునందన్ రావు , ఈటెల రాజేందర్, కల్వకుర్తి తెరాస ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి , పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ పరిమితులేమిటో తనకు తెలుసునని .. శక్తిమంతురాలినైన తన తలను ఎవరూ వంచలేరని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. తనకు ఎలాంటి ఇగో లేదని అందరితో సక్యంగా ఉండే స్నేహపూర్వక వైఖరి తనదని తమిళిసై పేర్కొన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసమే రాజ్ భవన్ లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు తమిళిసై తెలిపారు. గ్రీవెన్స్ సెల్ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించినట్లు తమిళిసై చెప్పారు. వచ్చే నెల నుంచి ప్రతి రెండో మంగళ వారం రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల మేలు కోసమే రాజ్ భవన్ ఉందని ప్రజల లబ్ధి కోసం ఉత్ప్రేరకంగా పనిచేస్తానని గవర్నర్ అన్నారు. రాజ్ భవన్ లో ఉగాది వేడుకలకు సామాన్యుల నుంచి రాష్ట్రంలోని అత్యున్నత వ్యక్తి వరకూ ఆహ్వానించినట్లు గవర్నర్ చెప్పారు. ఉగాది రాష్ట్రంలో నవశకం కావాలని అంతా కలిసి తెలంగాణను అభివృద్ధి చేయాలని తమిళిసై ఆకాంక్షించారు.

119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించానని.. కొందరు వచ్చారు రాని వారి గురించి నేను చెప్పేది ఏమి లేదన్నారు గవర్నర్. నేను వివాదాస్పదం చేసే వ్యక్తి ని కాదని గ్యాప్ ని సృష్టించే వ్యక్తి ని కాదన్నారు. కొన్ని అంశాలపై డిఫరెన్సెస్ ఉన్నాయన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళాను.. ఎవరు పిలుస్తారు అని నేను ఎదురు చూడనన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, రాజభవన్ కు గ్యాప్ రావడానికి కారణం తెలియదన్నారు. రాష్ట్రంలో ఎవరు తనకు ప్రోటోకాల్ ఇవ్వకున్నా... తన పని తాను చేసుకుంటూ వెళ్తానని చెప్పారు. పలు సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సందర్భంగా గవర్నర్ ఆర్థిక సాయం అందించారు.

గత కొద్దీ రోజుల నుంచి ప్రగతి భవన్ కి రాజ్ భవన్ కి గ్యాప్ పెరుగుతూనే వస్తుంది. తాజా గా గవర్నర్ తన అభిప్రాయం తెలపడంతో మరింత గ్యాప్ పెరిగింది..గవర్నర్ వాక్యాలపై ప్రగతి భవన్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories