Praneeth Rao: పాపాల పుట్ట.. మూడు రకాలుగా నేరానికి పాల్పడ్డ ప్రణీత్ రావు

Key points in Praneeth Rao Remand Report
x

Praneeth Rao: పాపాల పుట్ట.. మూడు రకాలుగా నేరానికి పాల్పడ్డ ప్రణీత్ రావు

Highlights

Praneeth Rao: మూడు రకాలుగా నేరానికి పాల్పడ్డ ప్రణీత్ రావు

Praneeth Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రణీత్ రావు మొత్తం 3 రకాలుగా నేరానికి పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. సాక్ష్యాలు చెరిపేయటం.. పబ్లిక్ ఆస్తుల ధ‌్వంసం.. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ టాంపరింగ్ నేరాలకు పాల్పడినట్టు గుర్తించారు. అతని నుంచి 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు రిమాండ్‌లో ఉంచి విచారిస్తున్నారు.

17 సిస్టంల ద్వారా ప్రణీత్ రావు ట్యాపింగ్ చేశారని.. ఫోన్ టాపింగ్ కోసం స్పెషల్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను ప్రణీత్‌కు కేటాయించుకున్నట్టు ఆధారాలు సేకరించారు. రహస్యంగా ప్రముఖుల కాల్ రికార్డింగ్స్‌ను మానిటర్ చేసినట్టు అధికారులు గుర్తించారు. సేవ్ చేసుకున్న రికార్డ్స్ మొత్తాన్ని అక్రమంగా పర్సనల్ పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసుకునేవాడని అధికారుల విచారణలో తేలింది. కొంతమందితో కలిసి ప్రణీత్ అక్రమాలకు పాల్పడటంతో... తన అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే హార్డ్‌డిస్క్‌లను తొలగించాడని అధికారులు నిర్ధారించారు. పాత హార్డ్‌డిస్క్‌లను కట్టర్లు ఉపయోగించి డిస్మాండిల్ చేయగా.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి పాత హార్డ్ డిస్క్‌లో ఉన్న డేటా మొత్తాన్ని ధ్వంసం చేసినట్టు అధికారులు నిర్ధారించుకున్నారు. కాగా... ఆపాత హార్డ్‌డిస్కుల్లో కొత్త హార్డ్‌డిస్కులను ఏర్పాటు చేసి.. అక్రమాలకు పాల్పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories