Kavitha Arrest: MLC కవిత రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు..

Key Points in MLC Kavitha Remand Report
x

Kavitha Arrest: MLC కవిత రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు.. 

Highlights

Kavitha Arrest: కవితను ఎందుకు అరెస్ట్‌ చేయాల్సి వచ్చిందో ED వివరణ

Kavitha Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన బీఆర్ఎస్ ‌ఎమ్మెల్సీ కవిత రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలకంగా ఉన్నారని స్పష్టం చేసింది ఈడీ. కవితను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చింది ఈడీ. కవితను 10 రోజుల కస్టడీకి అనుమతిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపింది ఈడీ. సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించినట్లు అభియోగం మోపింది ఈడీ. ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయలు ఇవ్వడంలో ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర అంటూ ఈడీ తన రిమాండ్ రిపోర్టులో తెలిపింది.

రామచంద్రపిళ్లై ద్వారానే ఈ వ్యవహారాన్ని అంతా నడిపినట్లు వివరించింది. కవితకు బినామీగా రామచంద్రపిళ్లై వ్యవహరించినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఎంపీ మాగుంట ద్వారా 30 కోట్ల రూపాయలను కవిత ఢిల్లీకి తరలించినట్లు ఈడీ తెలిపింది. అభిషేక్ బోయినపల్లి ఈ డబ్బును తరలించారని తెలిపింది. హవాలా ద్వారా ఈ డబ్బును ఢిల్లీ చేరవేశారని తెలిపింది ఈడీ. అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాతో ఎమ్మెల్సీ కవిత పలుమార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు ఈడీ తన రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories