Hyderabad: హైదరాబాద్ టెర్రర్ లింక్స్‌‌లో కీలక విషయాలు.. కీ ఆఫ్ రైట్ పాత్ పేరుతో యూట్యూబ్ ఛానల్

Key Facts in Hyderabad Terror Links
x

Hyderabad: హైదరాబాద్ టెర్రర్ లింక్స్‌‌లో కీలక విషయాలు.. కీ ఆఫ్ రైట్ పాత్ పేరుతో యూట్యూబ్ ఛానల్

Highlights

Hyderabad: రెండో దఫాలో ఇస్లాంను నమ్మేలా స్పెషల్ క్లాస్‌లు, ప్రసంగాలు

Hyderabad: హైదరాబాద్ టెర్రర్ లింక్స్‌‌లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కీ ఆఫ్ రైట్ పాత్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహించినట్లు కనుకొన్నారు. ఇక డార్క్ వెబ్, రాకెట్ చాట్, తీమ్రా యాప్‌ల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. కామన్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు నిందితులు. మూడు దఫాలుగా హైదరాబాద్ మాడ్యుల్ ప్లాన్ తయారు చేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు.. మొదటి దఫాలో మతమార్పిడి, రెండో దఫాలో ఇస్లాంను నమ్మేలా స్పెషల్ క్లాస్‌లు, ప్రసంగాలు, మూడో దఫాలో ఆయుధాలు, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చినట్లు నిర్ధారించారు. ఇక భోపాల్ నుండి యాసిర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. హైదరాబాద్‌లో ఇంప్లిమెంట్ చేశాడు సలీం. 12 మంది భోపాల్ వాసులు, ఐదుగురు హైదరాబాదీలకు ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అరెస్ట్ అయిన 17 మందిలో జిమ్ ట్రైనర్, ప్రొఫెసర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డెంటిస్ట్, టీచర్లు, టైలర్, ఆటో డ్రైవర్, దినసరి కూలీలు ఉన్నట్లు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories