Telangana: పోలీస్ యూనిఫాంలో కీలక మార్పులు

Telangana Police Uniform
x

Telangana: పోలీస్ యూనిఫాంలో కీలక మార్పులు

Highlights

Telangana Police Uniform: తెలంగాణ పోలీస్ యూనిఫాంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు యూనిఫాం బ్యాడ్జీలో తెలంగాణ స్టేట్ పోలీస్ TSP అనే అక్షరాలు ఉండేవి.

Telangana Police Uniform: తెలంగాణ పోలీస్ యూనిఫాం (Telangana Police Uniform) లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు యూనిఫాం బ్యాడ్జీలో తెలంగాణ స్టేట్ పోలీస్ TSP అనే అక్షరాలు ఉండేవి. వాటిని తెలంగాణ (Telangana) పోలీస్ TGగా మార్చారు. లోగోలోనూ తెలంగాణ స్టేట్ పోలీస్ TSPగా ఉండగా ఇకపై తెలంగాణ పోలీస్‌గా మార్చాలని హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే అధికారిక సంక్షిప్త నామాన్ని ప్రభుత్వం TGగా మారుస్తూ గతంలోనే రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు సైతం జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో TGగా మార్పులు చేయాలని సూచించారు. ప్రభుత్వ జీవోలు, నోటిఫికేషన్లు, సర్క్యులర్లు, లెటర్‌ హెడ్స్‌, పాలసీ పేపర్లు, అధికారిక పత్రాల్లోనూ టీజీ వచ్చేలా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీని TSRTC స్థానంలో TGSRTCగా మార్పులు చేశారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కూడా TS స్థానంలో TGగా చేస్తున్నారు. తాజాగా తెలంగాణ పోలీస్ బ్యాడ్జ్, లోగోను కూడా మార్చారు.

తెలంగాణ పోలీస్ బ్యాడ్జిల్లోనూ మార్పులు చేస్తూ రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు పోలీస్ బ్యాడ్జిలపై ఉన్న TSను TGగా మార్చారు. సివిల్, ఏఆర్, TSSP, SAR CPL, PTO విభాగాలకు సంబంధించి కానిస్టేబుల్‌ నుంచి నాన్‌కేడర్‌ ఎస్పీల వరకు ప్రస్తుతం TSPగా ఉన్న పీక్‌ క్యాప్‌ మోనోగ్రామ్‌ను ఇకపై TGPగా మార్చారు. అలాగే ఇప్పటివరకు తెలంగాణ స్టేట్‌ పోలీస్‌గా ఉన్న లోగోను తెలంగాణ పోలీస్‌గా మార్పులు చేశారు. TSSP షోల్డర్‌ బ్యాడ్జీని TGSPగా, TSP షోల్డర్‌బ్యాడ్జిని TGPగా, TSPC షోల్డర్‌ బ్యాడ్జిని TGPSగా మార్చారు.

తెలంగాణ ఆవిర్భావం కంటే ముందు TG అనే పేరు ఎక్కువగా వాడుకలో ఉండేది. ఉద్యమ కారులు నిరసనలు వ్యక్తం చేస్తేందుకు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై TG అనే రాసుకునేవారు. అయితే రాష్ట్ర ఆవిర్భావం, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని తెలంగాణ స్టేట్ TS పేరుతో రిజిస్ట్రేషన్లను చేయించారు. దీంతో అప్పటి నుంచి TS పేరు వ్యవహారికంలో ఉండేది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ఉద్యమ సమయంలో ఉపయోగించిన TGనే వినియోగించాలని డిసైడ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories