KCR Tributes to PV Narasimha Rao: పీవీకి సీఎం కేసీఆర్ ఘన నివాళి..

KCR Tributes to PV Narasimha Rao: పీవీకి సీఎం కేసీఆర్ ఘన నివాళి..
x
Highlights

KCR tributes to PV Narasimha Rao: భారత మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ భూమి పుత్రుడు పాములపర్తి వెంకట నరసింహారావు శత జయంత్యుత్సవాలు ఆదివారం నుంచి మొదలు కానున్న విషయం తెలిసిందే.

KCR tributes to PV Narasimha Rao: భారత మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ భూమి పుత్రుడు పాములపర్తి వెంకట నరసింహారావు శతజయంత్యుత్సవాలు ఆదివారం నుంచి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో పీవీ జ్ఞాన భూమి వద్ద జరిగిన శత జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ చిత్ర పటానికి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ తో పాటు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, పలువురు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు కూడా పీవీకి ఘన నివాళి అర్పించారు. ఇక పీవీ పీవీ చిత్ర పటానికి నివాళులర్పించడానికి సీఎం కేసీఆర్‌తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వేదికపైకి చేరుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమానికి పీవీ కుటుంబ సభ్యులు, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ జ్ఞానభూమిలో సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బహుభాషా కోవిధుడికి విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.

ఇటు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కూడా పీవీకి ఘన నివాళులర్పించారు. ట్విట్టర్‌ ను వేదికగా చేసుకుని తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పీవీ నరసింహారావు. ఆలోచనాపరుడిగా, పరిపాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన చూపిన ప్రజ్ఞ ఆమోఘం, సాహితీవేత్తగా, బహుభాషా కోవిధుడిగా, అనితర సాధ్యం. ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారతదేశానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆయనదే అని పొగిడారు. ఆ మహనీయుని శతజయంతి ఉత్సవం మొదలైన సందర్భంగా తెలంగాణ ఠీవీ పీవీని ఘనంగా స్మరించుకుందాం. ఘన నివాళులు అర్పిద్దాం'' అని మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌లో రాశారు.

ఇక ఇటు పీవీ 100వ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి కేటీఆర్‌ పీవీకి నివాళి అర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు. ఈ విషయాలని మంత్రి కేటీఆర్ ఆయన ట్విట్టర్‌ లో పోస్ట్ చేసారు. ట్విటర్ ను వేదికగా చేసుకుని తెలంగాణ భూమి పుత్రుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని కొనియాడారు. ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాక ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా పలువురు నాయకులు, ఉన్నతాధికారులు కూడా ఘన నివాళులు అర్పిస్తున్నారు.

ఇక పోతే పీవీ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ సుమారు 50 దేశాల్లో ఆదివారం వేడుకలు నిర్వహించనున్నారు. శతజయంత్యుత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. ఇక విదేశాల్లో ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చేపట్టారు. పీవీ శత జయంతి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పొడవునా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. పీవీకి నరసింహారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయించి ప్రధాని వద్దకు స్వయంగా వెళ్లి విన్నవిస్తామని సీఎం కేసిఆర్ ఇదివరకే స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories