సభనా..రోడ్‌షోనా.. ఈటలపై కామెంట్ చేయడం కేసీఆర్‌కు ఇష్టం లేదా?

KCR to use Plenary as Huzurabad Bypoll Public Meeting
x

సభనా..రోడ్‌షోనా.. ఈటలపై కామెంట్ చేయడం కేసీఆర్‌కు ఇష్టం లేదా?

Highlights

Huzurabad: కేసీఆర్ సభలకు ఈసీ బ్రేకులేసిందా?

Huzurabad: కేసీఆర్ సభలకు ఈసీ బ్రేకులేసిందా? భారీ సభతో సీన్ మార్చేద్దామనుకున్న టీఆర్‌ఎస్‌కు ఈసీ నిర్ణయం కొరకరాని కొయ్యగా మారుతోందా? ప్రతీ పనికి బీజేపీ ఈసీని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తుందా? అమిత్ షా, నడ్డాలు రాని హుజురాబాద్‌కు కేసీఆర్ ఎందుకని కమలనాథులు అనుకుంటున్నారా? ఇంతకీ కేసీఆర్ హుజురాబాద్ వెళ్తారా వెళ్లి ప్రచారం చేస్తారా? ఒకవేళ వెళ్లినా రోడ్డు షోలకే పరిమితమా? మరి బీజేపీ కూడా అదే షోలకు డిసైడవుతోందా? ప్రచారం చివరి అంకంలో రెండు పార్టీల మధ్య సాగుతున్న దోబూచులాట ఏంటీ?

హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో రోజుకో కొత్త రాగం వినిపిస్తోంది. ఇంత సుధీర్ఘంగా సాగుతున్న ఎన్నకల ప్రచారంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు అధికార పార్టీ నేతల ప్రచారానికి అడ్డంకిగా మారాయి. ఎన్నిక ప్రచారం మరో వారం గడువుండగానే ఎన్నికల సంఘం భారీ బహిరంగ సభలకు బ్రేక్‌లు వేసింది. అంతకుముందు టీఆర్ఎస్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధుకూ బ్రేకులు వేసింది. మొదట్లో అంత సీరియస్‌గా పట్టించుకోని ఈసీ, ఇప్పుడు నిశితంగా చూస్తోందట.

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారం కోసమని కేసీఆర్‌ రెండుసార్లు వెళ్లారు. నోటిఫికేషన్‌కు ముందు, తర్వాత వెళ్లి, జనాలకు హామీలిచ్చి మళ్లీ వాటిని రివ్యూ చేసేందుకు కూడా వెళ్లారు. సేమ్ టైమ్‌లో హుజురాబాద్‌కు వెళ్తారని అందరూ భావించారు. హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే దళితబంధు అని విపక్షాలు ఆరోపించినట్టుగానే ఎస్, మాదే సన్నాసుల మఠం కాదు బరాబర్‌ ఓట్ల కోసం పథకాలు పెడుతామని ఓట్లు ఆశిస్తామని కేసీఆర్ కుండబద్దలు గొట్టినట్టు చెప్పారు. అయితే హుజురాబాద్ వేదికగా దళితబంధు ప్రకటించినప్పటికీ ఉపఎన్నిక ఊసు లేకుండా ఎన్నికల ప్రచారం చేశారు. అవసరం అనుకుంటే ప్రతీ మండలానికి వస్తానని కూడా కేసీఆర్ చెప్పారు. కాని నోటిఫికేషన్ వచ్చి ప్రచారం ముగుస్తున్న క్రమంలో కేసీఆర్ సభలపై క్లారిటీ లేదు.

మూడునెలలుగా టీఆర్ఎస్‌, బీజేపీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఇందులో భాగంగా మంత్రి హరీష్‌రావు అక్కడే మకాం వేసి పని చేస్తున్నారు. మంత్రులు గంగుల, కొప్పుల, పల్లా, బాల్క సుమన్ మినహా మిగిలిన ముఖ్య నేతలు ఎవరు కనిపించలేదు. అయితే చివరకు కేసీఆర్‌ను రంగంలోకి దింపాలి, ఉపఎన్నిక జోష్ నింపాలని పార్టీ కసరత్తు చేసింది. అందుకు పక్క జిల్లా పెంచికల్‌పేట సమీపంలో కేసీఆర్ సభకు లక్ష మందిని తరలించాలని ప్లాన్ కూడా చేసి అనుమతి కోసం దరఖాస్తు కూడా చేసుకుంది. కాని ఇప్పుడా సభలు ఉండవని భారీ సభలకు అనుమతి లేదని ఈసీ బ్రేకులు వేసిందన్న చర్చ జరుగుతోంది. దీంతో కేసీఆర్ సభపై టీఆర్ఎస్‌ ఇప్పుడు తర్జనభర్జనలు పడుతోంది. ఇప్పుడేం చేయాలి కేసీఆర్ రోడ్‌షోలు నిర్వహించాలా లేక ప్రచారం విషయంలో కామ్‌గా ఉండాలా అనే విషయం తేలాల్సి ఉంది.

ఇంతకీ కేసీఆర్ ప్రచారం చేస్తారా చేస్తే బీజేపీ కోణంలో విరుచుకుపడుతారా లేక ఈటలపై నిప్పులు చెరుగుతారా పార్టీలో ఇదే సస్పెన్స్. ఈటలను బర్తరఫ్‌ చేసింది మొదలు ఇప్పటిదాకా కేసీఆర్ ఓపెన్‌గా ఎక్కడ ఆయన పేరెత్తలేదు. హుజురాబాద్ వెళ్లి కూడా ఈటలను ఉచ్చరించలేదు. కాని ఈటలను ఓడించాలని కేసీఆర్ చేయనీ ప్రయత్నం లేదు. అయితే పార్టీ ఒత్తిడి మేరకు ఒకవేళ కేసీఆర్ రోడ్‌షోలు నిర్వహిస్తే ఈటలపై ఎక్కుపెట్టే బాణాలేంటి అయితే ఈటలను కాకుండా బీజేపీని తిట్టేసి ప్రచారం ముగిస్తారా అనే చర్చ కూడా ఉంది.

మరోపక్క బీజేపీపై టీఆర్ఎస్‌ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. బీజేపీకి రావాల్సిన స్టార్ కాంపయినర్లంతా వచ్చి ప్రచారం చేస్తున్నారు. కేంద్రమంత్రులు స్మృతిఇరాని నుంచీ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వరకు బీజేపీలో ఉన్న స్టార్‌లంతా ప్రచారంలో ఉన్నారు. వీరందరి ప్రచారం తిప్పికొట్టేలా కేసీఆర్ సభకు ప్లాన్ చేస్తే ఈసీ బ్రేకులేసిందని చెబుతున్నారు. అయితే, ఈటలపై సీఎం కేసీఆర్ కసిగా ఉన్నా, కోపంతో గుర్రుగా ఉన్నా స్థాయి తగ్గించుతుని బహిరంగంగా ఈటలపై కామెంట్ చేయడానికి కేసీఆర్‌కు ఇష్టం లేదంటున్నారు. ఒకవేళ రోడ్ షోలు ఉన్నా లేకపోయినా పార్టీ ప్లీనరీని వేదిక చేసుకోవాలని భావిస్తున్నారట. ఈనెల 25వ తేదీన హైదరాబాద్ నుంచే హుజురాబాద్ బైపోల్ సీన్ క్రియేట్ చేస్తారని చెబుతున్నారు. మొత్తానికి క్లైమాక్స్ కన్‌క్లూజన్ ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారని పెద్ద సస్పెన్స్‌లా ఉంది. మొత్తానికి వరసగా టీఆర్ఎస్ కార్యక్రమాలకు ఎదురు దెబ్బ తగులుతుంటడంతో బీజేపీ కుట్రలు చేస్తుందని ఈసీ భుజాన తుపాకి పెట్టి కాలుస్తుందని మండిపడుతున్నారు కారు పార్టీ నేతలు. అయితే హుజురాబాద్‌లో ప్రచారం ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా కేసీఆర్‌తో హుజురాబాద్‌లో రోడ్‌షోలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.

Show Full Article
Print Article
Next Story
More Stories