మరో కొత్త పథకం తెచ్చే యోచనలో సీఎం కేసీఆర్..

KCR to Hold Cabinet Meeting Today
x

మరో కొత్త పథకం తెచ్చే యోచనలో సీఎం కేసీఆర్..

Highlights

Telangana Budget 2022: తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఆదివారం కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.

Telangana Budget 2022: తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఆదివారం కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ప్రతిపాదిత బడ్జెట్ కు ఆమోదం తెలుపనున్నారు. ఈ బడ్జెట్ పద్దులను ఆర్ధిక మంత్రి హరీశ్ రావు సభలో ప్రవేశపెడ్తారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముందుగా నిర్వహించనున్న కేబినెట్ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ఉదయం ప్రగతి భవన్ లో మంత్రివర్గం సమావేశంకానుంది. నిధులు, నీళ్లు, నియామక అంశాలు ప్రధాన అజెండా కాగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పద్దులకు సంబంధించిన అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావనకు రాబోతున్నాయి.

శాసనసభ సమావేశాలు ప్రత్యేకతను సంతరించుకోబోతున్నాయి. అభివృద్ధికి సంబంధించిన నిధులు సంక్షేమ పథకాలకు కేటాయించే నిధులతోపాటు కేసీఆర్ కలల పథకం దళితబంధుకు నిధుల కేటాయింపుపై చర్చించి సముచిత నిర్ణయం తీసుకోబోతున్నారు.

తెలంగాణ బడ్జెట్ రెండు లక్షల యాభై వేల కోట్ల అంచనాలతో రూపుదిద్దుకున్నట్లు సమాచారం. శాఖలవారీగా పద్దుల కేటాయింపులు, ఉద్యోగ నియామకాలు, పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు ప్రత్యామ్నాయంగా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories