గ్రేటర్ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ నజర్‌.. ఇవాళ మంత్రులతో సీఎం కేసీఆర్‌ సమావేశం..!

గ్రేటర్ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ నజర్‌.. ఇవాళ మంత్రులతో సీఎం కేసీఆర్‌ సమావేశం..!
x
Highlights

అధికార పార్టీ టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. దుబ్బాక ఫలితాల ప్రభావం గ్రేటర్ ఎన్నికలపై పడే అవకాశం ఉండటంతో అప్రమత్తమైంది పార్టీ....

అధికార పార్టీ టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. దుబ్బాక ఫలితాల ప్రభావం గ్రేటర్ ఎన్నికలపై పడే అవకాశం ఉండటంతో అప్రమత్తమైంది పార్టీ. ప్రత్యర్థి పార్టీల కంటే ముందే పూర్తి స్థాయిలో సిద్ధం కావాలనే భావనలో ఉంది టీఆర్ఎస్‌. ఈ నేపథ్యంలోనే ఇవాళ సీఎం కేసీఆర్‌ అందుబాటులో ఉన్న నేతలు, మంత్రులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

మంత్రులు, నేతలతో సీఎం సమావేశం తర్వాత ఎన్నికలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు రెండు రోజుల్లో మంత్రి మండలి సమావేశం కూడా ఖరారయ్యే ఛాన్స్ ఉంది. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

దుబ్బాకలో గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన అధికార పార్టీ చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. బీజేపీ, టీఆర్ఎస్‌ మధ్య హోరాహోరీ సాగినా చివరకు బీజేపీ దుబ్బాక సీటును కైవసం చేసుకుంది. దీంతో ఇవాళ సీఎం నిర్వహించే సమావేశంలో దుబ్బాక ఫలితాలపై కూడా చర్చించనుంది టీఆర్ఎస్‌. దుబ్బాక ఫలితాలతో గ్రేటర్‌లోనూ రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో ప్రత్యర్థుల కంటే ముందే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories