CM KCR: బీఆర్ఎస్ మొదటి లిస్ట్ ఖరారు?.. 15శాతం సిట్టింగ్‌లకు సీటు గల్లంతే

KCR To Be Released In Two Installments First List Releasing Soon
x

CM KCR: బీఆర్ఎస్ మొదటి లిస్ట్ ఖరారు?.. 15శాతం సిట్టింగ్‌లకు సీటు గల్లంతే 

Highlights

CM KCR: అప్పటికి మరికొందరి పేర్లు ఖరారయ్యే అవకాశం

CM KCR: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ మొదటి లిస్ట్‌ను ఫైనల్ చేసినట్లు తెలిసింది. ఫస్ట్ లిస్ట్‌ను ఈనెల 21న రిలీజ్ చేస్తారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. సుమారు 15శాతం మంది సిట్టింగ్‌లకు ఈసారి టికెట్ రాదని తెలుస్తోంది. టికెట్ రాదని నిర్ధారణ అయిన వారు కేసీఆర్‌, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావును కలిసి ఒత్తిడి చేయాలని భావిస్తున్నారు.

మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్లు ఖరారైనప్పటికీ వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దింపే అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ , టీడీపీల నుంచి బీఆర్ఎస్‌ లోకి వచ్చిన సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తుండటంతో అభ్యర్థుల ఖరారు ప్రక్రియ పై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. సీపీఐ, సీపీఎంతో బీఆర్ఎస్ ఎన్నికల పొత్తు ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇతర పార్టీ నుంచి ఒకరిద్దరు చేరికలపై స్పష్టత వచ్చిన తర్వాత రెండో లిస్ట్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. కమ్యనిస్టులతో పొత్తు కుదిరితే మునుగోడు, భద్రాచలం స్థానాలను వదిలేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories