Raghunandan Rao: ఈ కేసులో కేసీఆర్‌ను మొదటి ముద్దాయిగా చేర్చాలి

KCR Should Be Included As The First Accused In This Case Says Raghunandan Rao
x

Raghunandan Rao: ఈ కేసులో కేసీఆర్‌ను మొదటి ముద్దాయిగా చేర్చాలి

Highlights

Raghunandan Rao: ఫోన్ ట్యాపింగ్ అంశంలో నేను కూడా బాధితుడినే

Raghunandan Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి ముద్దాయిగా కేసీఆర్‌ పేరును చేర్చాలని డిమాండ్ చేశారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు. దుబ్బాక ఉప ఎన్నికలోనే ఫోన్ ట్యాపింగ్ అంశం బయటపడిందని ఆయన ఆరోపించారు. ఈ కేసులో అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి హరీష్‌రావు పేరును కూడా చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు రఘునందన్‌రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేవలం ముగ్గురు పోలీసులను మాత్రమే అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తాను కూడా బాధితుడిగానే ప్రభుత్వాన్ని కోరుతున్నాని తెలిపారు రఘునందన్‌రావు. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ప్రమేయమున్న వారు విదేశాలకు పారిపోకుండా పాస్‌పోర్టులు సీజ్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతున్నట్లు తెలిపారు రఘునందన్‌రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories