విద్యుత్ ఒప్పందాలపై జూలై 22 లోపు కొత్త ఛైర్మెన్: సుప్రీంలో తెలంగాణ సర్కార్

KCR Petition In Supreme Court Over Justice Narasimha Reddy Commission
x

జడ్జిని మార్చండి.. కేసీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Highlights

Supreme Court: విద్యుత్ కొనుగోలుపై మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.

Supreme Court: విద్యుత్ కొనుగోలుపై మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కమిషన్ ఛైర్మన్ ప్రెస్‌మీట్ పెట్టడాన్ని సీజేఐ అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషన్ ఛైర్మన్ తన అభిప్రాయాలు ఎలా వ్యక్తం చేస్తారంటూ సీజేఐ ప్రశ్నించారు.

పవర్ కమిషన్‌కు మరొక జడ్జిని నియమించాలని సీజేఐ ఆదేశించారు. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా, నిష్పక్షపాతంగా కనిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఎంక్వైరీ జడ్జిని మార్చాలంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

విచారణ కమిషన్ నుండి తప్పుకున్న జస్టిస్ నరసింహారెడ్డి

సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో విద్యుత్ కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ నుండి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం నాడు లేఖను విడుదల చేశారు. విచారణ కమిషన్ ఛైర్మెన్ గా మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కమిషన్ కు కొత్త ఛైర్మెన్ ను నియమించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

విద్యుత్ కమిషన్ కు కొత్త ఛైర్మెన్ నియామకం

విచారణ కమిషన్ నుండి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవడంతో ఆయన స్థానంలో కొత్త ఛైర్మెన్ ను నియమిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపింది. సోమవారం లోపుగా కొత్త ఛైర్మెన్ ను నియమిస్తామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది.




Show Full Article
Print Article
Next Story
More Stories