KCR Latest Speech: చిచ్చు రేపిన ప్లీనరీ మీటింగ్‌లో కేసీఆర్ వ్యాఖ్యలు

KCR Latest Speech in TRS Party Plenary Creating Issue Between Telangana and AP | Telugu Online News
x

KCR Latest Speech: చిచ్చు రేపిన ప్లీనరీ మీటింగ్‌లో కేసీఆర్ వ్యాఖ్యలు

Highlights

KCR Latest Speech: టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా చేసేందుకే కేసీఆర్ కామెంట్స్...

KCR Latest Speech: తెలంగాణ పథకాలను ఏపీ ప్రజలు కోరుకుంటున్నారా. ఏపీ పథకాలు అక్కడి ప్రజలను సంతృప్తి పర్చడం లేదా.. నిజంగానే తెలంగాణ పథకాలపై ఏపీ ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారా.. అసలు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలేంటి.? ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్న పథకాల వార్‌ ఏంటి.?

టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వానికి కోపం తెప్పించాయి. తెలంగాణలో అమలవుతున్న పథకాలను ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని కేసీఆర్‌ చెప్పుకచ్చారు. దీంతో కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఘాటుగా స్పందిస్తున్నారు. తెలంగాణతో పోల్చితే ఏపీలోనే ఎక్కువ పథకాలు అమలు అవుతున్నాయని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు.

తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తోంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, గురుకుల పాఠశాలలు, దళిత బంధు, రైతు బీమా, రైతుబంధు, ఆరోగ్యశ్రీ, కేసీఆర్ కిట్, దళితులకు మూడు ఎకరాల, మత్య కారులకు చేపల పంపిణీ, గొల్ల కురుములకు గొర్రెల పంపిణీ, గౌడ, బీడీ, చేనేతలకు పెన్షన్లు, బ్రహ్మణుల కోసం నిధి, పైగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ప్రకృతి వనాలు, వైకుంఠ దామాలు, హరితహారం ఇలా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ పార్టీ ప్లీనరీ సమావేశంలో చెప్పుకచ్చారు.

ఇటు వైసీపీ ప్రభుత్వం కూడా అనేక పథకాలను అమలు చేస్తోంది. జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ పెన్షన్‌ కానుక, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగన్న చేదోడు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, జగన్న విద్యదీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిషన్ ద్వారా రైతులకు ఎకరాకు 13,500, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు వంటి పథకాలను అమలు చేస్తోంది. పైగా నాడు- నేడు వంటి కార్యక్రమాలను కూడా పకడ్బందీగా అమలుచేస్తోంది.

ప్లీనరీ మీటింగ్‌లో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల నేతల మధ్య అగ్గిరాజేశాయి. తమ రాష్ట్రంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందంటే లేదు లేదు. తమ రాష్ట్రంలోనే ఎక్కువ జరిగిందని ఇరు రాష్ట్రాల మంత్రులు ఆరోపణలు చేసుకుంటున్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీని జాతీయ పార్టీగా చేసేందుకే సీఎం కేసీఆర్ ఆ కామెంట్స్ చేసి ఉంటారని తెలుస్తోంది. గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగాలని కేసీఆర్‌ ట్రై చేశారు. కానీ పెద్దగా వర్క్‌ అవుట్‌ కాలేదు. ఇప్పుడు మరోసారి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి టీఆర్‌ఎస్‌ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories