గులాబీ వర్గం ఎవరికి సపోర్ట్..?

KCR in the Process of Converting TRS into BRS
x

గులాబీ వర్గం ఎవరికి సపోర్ట్..?

Highlights

CM KCR: విపక్ష కూటమికి దూరంగా ఉన్న కేసీఆర్

CM KCR: రాష్ట్రపతి ఎన్నికల్లో రెండు కూటముల తరపున అభ్యర్ధులు ఫైనల్ అయ్యారు. వ్యూహ ప్రతివ్యూహాలతో అభ్యర్ధులను ప్రకటించిన ఇరుపక్షాలు సమరానికి సై అంటున్నారు. పూర్తి స్థాయి బలంతో విజయం తమదే అన్న ధీమాను బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏ పక్షం ఉండగా.. ఎన్డీఏ కూటమిని దెబ్బ దీయాలని ప్రతిపక్ష పార్టీల కూటమి ఎత్తుగడలు వేస్తుంది. ఇదే సమయంలో తెలంగాణలో గులాబీ దళపతి ఏ శిబిరం వైపు మొగ్గుచూతారన్నది చర్చనీయంశంగా మారింది.

రాష్ట్రపతి ఎన్నికలను టార్గెట్ చేస్తూ కేంద్రంలో అధికార విపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో అడుగులు వేస్తున్నాయి. ఇదే తరుణంలో జాతీయ రాజకీయాల పై ఫోకస్ పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ఎటు వైపు మొగ్గు చూపుతారన్నది సస్పెన్స్ గా మారింది. కేంద్రంలో బీజేపీ సర్కార్ ను గద్దె దించాలని ప్రయత్నిస్తున్న గులాబీ దళపతి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చే పనిలో పడ్డారు. జాతీయ స్థాయిలో రాష్ర్టపతి ఎన్నికనే కేంద్రంగా రాజకీయ వ్యూహాలు రంజుగా నడుస్తున్నాయి. కాంగ్రెస్ ఉన్న కూటమితో కలిసి పని చేయమని స్పష్టం చేసిన కేసీఆర్...ఇటీవల విపక్ష కూటమి నిర్వహించిన సమావేశానికి సైతం దూరంగా ఉన్నారు.

పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ నేతృత్వంలోని 22 రాజకీయ పార్టీలు ఏకమై రాష్ట్రపతి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేశాయి. ఈ సందర్భంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఓ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ తమ వైపే ఉన్నారంటూ ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే కేసీఆర్ మాత్రం ఈ విషయంలో ఏ నిర్ణయం ప్రకటించ లేదు. మరో వైపు అత్యున్నత పదవిలో ఇప్పటి వరకు గిరిజన తెగకు చెందిన వారికి అవకాశం దక్కలేదు. తొలిసారిగా ఆదివాసి మహిళకు బీజేపీ అవకాశం కల్పించింది.

గిరిజన మహిళగా మద్దతు ఇస్తే.. తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో కేసీఆర్ న్యూట్రల్ గా ఉంటారా లేక ఏదో ఒక కూటమి వైపు ఓటు వేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో కలిసి పని చేస్తున్న కేసీఆర్...రాష్ట్రపతి ఎన్నికల్లో తన రాజకీయ చాణుక్యతను ఏ విధంగా చూపుతారో అన్నది రాజకీయవర్గాల్లో చర్చ కొనసాగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories