KCR: కొండగట్టు అంజన్న ఆలయంలో సీఎం కేసీఆర్‌

KCR In Kondagattu Anjanna Temple
x

KCR: కొండగట్టు అంజన్న ఆలయంలో సీఎం కేసీఆర్‌

Highlights

KCR: సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు

KCR: జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటిస్తున్నారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొండగట్టు సమీపంలోని నాచుపల్లి JNTUకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అటు నుంచి రోడ్డుమార్గంలో అంజన్న క్షేత్రానికి వెళ్లారు.

ఆలయం వద్ద సీఎం కేసీఆర్‌కు అర్చకులు, పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రులు, ప్రజాప్రతినిథులు, అధికారులతో కలిసి కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించారు.

కాసేపట్లో JNTU సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు- చేర్పులపై చర్చించనున్నారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టే అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి రానున్నారు. ఇప్పటికే కొండగట్టు అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ 00 కోట్లు రూపాయలు కేటాయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories