Telangana: ఇవాళ దళపతుల ప్రచార హోరాహోరీ.. కొడంగల్‌లో కేసీఆర్.. గజ్వేల్‌లో రేవంత్‌రెడ్డి ప్రచారం

KCR in Kodangal, Revanth Reddy Campaign in Gajwel
x

Telangana: ఇవాళ దళపతుల ప్రచార హోరాహోరీ.. కొడంగల్‌లో కేసీఆర్.. గజ్వేల్‌లో రేవంత్‌రెడ్డి ప్రచారం

Highlights

Telangana: నువ్వా నేనా అంటూ దూసుకుపోతున్న అగ్రనేతలు

Telangana: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా పార్టీలు దూసుకెళ్తున్నాయి. ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఇవాళ కొడంగల్‌లో సీఎం కేసీఆర్.. గజ్వేల్‌లో రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు.

ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 50 ఏళ్లుగా జరగని అభివృద్దిని పదేళ్లలో చేసి చూపించి.. రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతీ సభలో గత ప్రభుత్వాలకు, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు తేడాలు గుర్తించాలని సీఎం ఇస్తున్న పిలుపునకు ప్రజలు ఉత్సాహంగా స్పందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories