KCR America Tour: కేసీఆర్ అమెరికా టూర్‌పై ఆసక్తికరమైన చర్చ

KCR America Tour
x

KCR America Tour

Highlights

KCR America Tour News: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

KCR America Tour News: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయన సీఎం అవడానికి ముందు కానీ లేదా సీఎం హోదాలో ఉన్నప్పుడు కానీ అమెరికాకు వెళ్లిన దాఖలాలు లేవు. అమెరికాలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ అమెరికా వెళ్లారు కానీ కేసీఆర్ వేళ్లలేదు. దీంతో ఇప్పుడు కేసీఆర్ అమెరికా టూర్ న్యూస్ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

ప్రస్తుతం కేటీఆర్ కొడుకు హిమాన్ష్ అమెరికాలోనే చదువుకుంటున్నారు. అందుకే కేసీఆర్ మనవడి వద్దకు వెళ్లి అక్కడే రెండు నెలల పాటు సమయం గడిపి వద్దామనుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. కాకపోతే ఆయన అమెరికా ఎప్పుడు వెళ్లనున్నారు అనే విషయంలోనే స్పష్టత కొరవడింది.

కేసీఆర్ అమెరికా పర్యటనపై ఆయన కుటుంబం నుండి కూడా ఎవ్వరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేసీఆర్ అమెరికా వెళ్లనున్నారని కేటీఆర్ కానీ లేదా కవిత కానీ లేదా హరీష్ రావు కానీ ప్రకటించలేదు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో మాత్రం కేటీఆర్ అమెరికా వెళ్తున్నారట అనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories