ఆ ఇద్దరిపై కేసీఆర్‌ ఎందుకు కోపమయ్యారు?

ఆ ఇద్దరిపై కేసీఆర్‌ ఎందుకు కోపమయ్యారు?
x
Highlights

వందల మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో కార్యవర్గ సమావేశం. ఒకవైపు గులాబీ అధినేత అనర్గళ ప్రసంగం. పిన్‌డ్రాప్ సైలెంట్. అందరూ చెవులప్పగించి అధినాయకుడి మాటలు...

వందల మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో కార్యవర్గ సమావేశం. ఒకవైపు గులాబీ అధినేత అనర్గళ ప్రసంగం. పిన్‌డ్రాప్ సైలెంట్. అందరూ చెవులప్పగించి అధినాయకుడి మాటలు వింటున్నారు. మున్సిపల్‌ ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలో కేసీఆర్‌ కర్తవ్యబోధ చేస్తున్నారు. కానీ ఉన్నట్టుండి ఇద్దరు నేతల మాటలతో, కేసీఆర్‌కు యమకోపం వచ్చేసింది. పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంతటి కోపానికి కారణమెవరో తెలుసా ఒకరు మాజీ మంత్రి, మరొకరు ఎమ్మెల్యే. మరెందుకు కేసీఆర్ కోపమయ్యారు వాళ్లిద్దరు చెప్పిన ఏ మాటలు, గులాబీ బాస్‌కు ఆగ్రహం తెప్పించాయి?

తెలంగాణ భవన్‌లో జరిగిన రాష్ట్ర విస్త్రృతస్థాయి కార్యవర్గ సమావేశానికి దాదాపు మూడు వందల మంది పార్టీలోని వివిధ స్థాయి నేతలు హాజరయ్యారు. పార్లమెంటు సభ్యులు శాసన సభ, మండలి సభ్యులు మంత్రులు జిల్లా పరిషత్ సభ్యులు వివిధ కార్పొరేషన్ల సభ్యులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై కీలకంగా చర్చించారు. జనంలోకి ఎలా వెళ్లాలి, పార్టీని మరింత బలంగా ఎలా తీసుకెళ్లాలన్న విషయాలపై దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఈసారి కూడా సమావేశంలో కీలకంగా మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు నేతలు చేసిన సూచనలకు, ఒక్కసారి భగ్గుమన్నారు అధినేత కేసీఆర్.

వారి మాట్లాడిన మాటలకు ఎప్పుడూలేనంత కోపం వచ్చింది కేసీఆర్‌కు. ఒక్కసారిగా ఫైర్‌ అయిపోయారు ఆ నేతలపై. ఇంతకీ ఎవరా నేతలు పార్టీ అధినేతకు ఎందుకు కోపం తెప్పించారు. మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని కేసీఆర్ సూచిస్తున్న సమయంలో, మాజీ మంత్రి జోగు రామన్న, ఇటు షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌లు ఒక మాట అన్నారట. వరుస ఎన్నికలతో ప్రజుల బేజారవుతున్నాని, ఇప్పుడు మళ్లీ ఎన్నికలంటే ఇబ్బందులు ఉంటాయని అన్నారట. ఇక అంతే. వెంటనే గులాబీ బాస్ గుడ్లెర్ర జేశారట. కోపం పట్టలేకపోయారట. ప్రజలంతా మనతోనే ఉన్నారు, ఎన్నికలంటే బేజారవుతుంది ప్రజలకు కాదు, మీలాంటి నాయకులకే అని తలంటారట. అంతటితో ఆగకుండా నాయకులంటే ఓపిక ఉండాలి అంతే ఓపికతో పనిచేయాలని మందలించినట్టు ఆ పార్టీ నేతలే బయటికొచ్చాక మాట్లాడుకున్నారు.

గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జోగు రామన్న, అధినేత మనసెరిగి మసలుకుంటారని, అంతా అనేవారు. అయితే 2018 ఎన్నికల్లో గెలిచి రెండోసారి రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చిన తర్వాత, సామాజిక సమీకరణాల కారణంగా జోగు రామన్నకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోయారు కేసీఆర్. దాంతో అప్పటి నుంచి నియోజకవర్గ స్థాయిలోనే పనులు చేసుకుంటూ, సెగ్మెంట్‌కే పరిమితమయ్యారు జోగు రామన్న.

ఇటు షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కూడా పెద్దగా మీడియా ఫోకస్‌లోనూ ఉండరు. ఉన్నట్టుండి అధినేత కోపానికి గురయ్యారు. మున్సిపల్‌ ఎన్నికలు తప్పదు, ఎదుర్కోవాల్సిందేనని తెలిసి కూడా, ఎన్నికలు ఎందుకన్నట్టుగా మాట్లాడి ఆగ్రహానికి పాత్రులయ్యారని, గులాబీ నేతలు గుసగుస లాడుకుంటున్నారు. ఇటు మాజీ మంత్రి జోగురామన్న, అటు షాద్‌ నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌లు అనవసరంగా కేసీఆర్‌ కంటపడ్డారని మాట్లాడుకుంటున్నారు టీఆర్ఎస్ నేతలు. టీఆర్ఎస్‌లో కేసీఆర్ ఏది అనుకుంటే అదే ఫైనల్. పార్టీ విస్త్రృతస్థాయి సమావేశం కదా అని అధినేతకే ఉచిత సలహాలు ఇవ్వాలనుకుంటే, ఇలాగే చీవాట్లు తప్పవంటున్నారు పార్టీ సీనియర్ నేతలు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories